Nagarjuna: నాగార్జున మైల్‌స్టోన్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. ఆ తమిళ డైరెక్టర్‌తో 100వ సినిమా!
Nagarjuna: టాలీవుడ్ సీనియర్ హీరో, మన్మథుడు అక్కినేని నాగార్జున ఈ ఏడాది ‘కుబేర’, ‘కూలీ’ సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ‘కూలీ’ సినిమాలో ఆయన నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ విజయాల తర్వాత, అభిమానులంతా నాగార్జున కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
నాగార్జున 100వ సినిమాను తమిళ దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కించనున్నారని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, ఈ చిత్రాన్ని 2026 మే నెలలో, వేసవి కానుకగా విడుదల చేయాలని నాగార్జున భావిస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.
యూనిక్ స్టోరీ టెల్లింగ్, థ్రిల్లింగ్ కథనాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రా కార్తీక్, నాగార్జున కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన సినిమాకు దర్శకత్వం వహించనుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. నాగార్జున 100వ సినిమా కోసం రా కార్తీక్ ఎలాంటి కథను సిద్ధం చేశాడనేది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
యూనిక్ స్టోరీ టెల్లింగ్, థ్రిల్లింగ్ కథనాలతో తనదైన మార్క్ చూపించే రా కార్తీక్ నాగార్జున కెరీర్ మైల్‌స్టోన్ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది.నాగార్జున కెరీర్‌లోని మైలురాయిగా నిలిచిపోయే ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఇంతకీ రా కార్తీక్ నాగ్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేశాడు. కూలీలో తొలిసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన నాగార్జున మరి రా కార్తీక్‌తో ఎలాంటి కథ చేయబోతున్నాడన్నది అందరిలో ఉత్కంఠ నెలకొంది.
