Alia Bhatt: నువ్వు ముందు గేట్ బయటకు వెళ్లు.. ఫొటోగ్రాఫర్లపై ఆలియా భట్ సీరియస్
Alia Bhatt: బాలీవుడ్ అగ్ర కథానాయిక అలియా భట్ ప్రస్తుతం సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితం ద్వారా కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె తాజాగా ఒక సాహసోపేతమైన పాత్రకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. యంగ్ అడల్ట్ కంటెంట్‌తో కూడిన ఒక బోల్డ్ వెబ్ సిరీస్‌లో నటించనున్నారు. ఈసారి థియేటర్లను కాకుండా ఓటీటీ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ కొత్త వెబ్ సిరీస్‌ను అలియా తన సొంత నిర్మాణ సంస్థ ‘ఎటర్నల్ సన్‌షైన్ పిక్చర్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. దీనికి సహ నిర్మాతగా ‘చాక్‌బోర్డ్ ఎంటర్‌టైన్‌మెంట్’ వ్యవహరిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు దర్శకురాలిగా శ్రీతి ముఖర్జీ పరిచయం కానున్నారు, ఈమె ‘బ్రహ్మాస్త్ర’ దర్శకుడు అయాన్ ముఖర్జీకి బంధువు. తన భర్త రణబీర్ కపూర్ నటించిన ‘వేక్ అప్ సిడ్’ చిత్రంలోని కాన్సెప్ట్‌ను ఒక అమ్మాయి కోణం నుంచి, మరింత బోల్డ్‌గా చెప్పాలనే ఆలోచనతో ఈ కథను అభివృద్ధి చేసినట్లు అలియా భట్ తెలిపారు. ఈ సిరీస్ షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నిర్మాతగా అలియాకు ఇది మూడవ ప్రాజెక్ట్ కానుంది.
ఫొటోగ్రాఫర్లపై అలియా అసహనం..
మరోవైపు, అలియా భట్ ఇటీవల ఫొటోగ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడం హాట్ టాపిక్‌గా మారింది. పికిల్ బాల్ గేమ్ ఆడి ఇంటికి వచ్చిన ఆమె, తన ఇంటి ఆవరణలోకి వచ్చిన ఫొటోగ్రాఫర్లను చూసి అసహనానికి గురయ్యారు. “లోపలికి రాకండి.. ఇదేం మీ ఇల్లు కాదు. దయచేసి బయటకు వెళ్లండి” అని ఆమె కోరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సెలబ్రిటీల ప్రైవసీని గౌరవించకుండా ఇలా ప్రవర్తించడంపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు.
https://www.instagram.com/reel/DNVcwarSlsp/?utm_source=ig_web_copy_link
ఇటీవలే విడుదలైన ‘వార్ 2’ సినిమాలో బాబీ దేవోల్‌తో కలిసి ఒక సన్నివేశంలో అలియా కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ చిత్రం కూడా యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగం కావడం విశేషం.