Alkaline Water : ఇప్పుడు మనం నీళ్ల గురించి ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసుకుందాం ..నీళ్లు మన రోజువారి జీవితంలో ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. ఒక పూట ఆకలికి అయినా తట్టుకుంటాం కానీ..దాహం వేస్తే మాత్రం తట్టుకోలేము.ఇది నిజం.. అయితే..ప్రకృతిలో వాతావరణ కాలుష్యం వల్ల, అలాగే మానవులు చేసే తప్పిదాల వల్ల కూడా నీరు చాలా కలుషితం అయిపోతుంది. చాలామంది కి తెలియని విషయం ఏంటంటే..
నీళ్లలో చాలా రకాలు ఉన్నాయి.. కొన్ని మన ఆరోగ్యానికి ప్రయోజనాన్ని చేకూరిస్తే.. మరికొన్ని అనారోగ్యాన్ని తెచ్చిపెడుతాయి..అయితే మన ఆరోగ్యానికి మేలు చేసే నీళ్లు ప్రత్యేకంగా ఉన్నాయి.. వినడానికి కాస్త విచిత్రంగానే ఉంది.. కానీ ఇది వాస్తవం. ఇక ఆలస్యం చేయకుండా ఆ నీళ్లు ఏంటి..? వాటికి సంబంధించిన విశేషాలు ఏంటో.. తెలుసుకుందాం..“ఆల్కలైన్ వాటర్” ఈ పేరు ఎప్పుడైనా విన్నారా..? ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ దీని గురించే..
ఈ వాటర్ వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు..ఇంతకీ ఆల్కలైన్ వాటర్ అంటే ఏమిటి..? ఈ వాటర్ ఎక్కడినుండి వస్తాయి..? ఎలా తయారు చేస్తారు? ఈ వాటర్ తాగితే చేకూరే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి..? అనేది వెంటనే తెలుసుకుందాం..మానవ శరీరానికి” మితాహారం” ఆరోగ్యానికి మంచిది. “అధిక ఆహారం” విషంతో సమానమని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది పాతకాలం విషయమే అయినప్పటికీ ఇప్పటికి కూడా దీన్ని మనం పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలం. అలాగే ..నీళ్ల విషయంలో కూడా ఈ సూత్రం వర్తిస్తుంది..
సంపూర్ణ ఆరోగ్యం అందించడంలో నీరు కూడా ప్రధాన పాత్రను పోషిస్తుంది. శరీరానికి తగినన్ని నీటిని అందిస్తే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం చేసుకోవచ్చు. అది ఎలాగంటే…ఈ ఆల్కలైన్ వాటర్ ని తీసుకోవడం వల్ల బాడీలోని పీహెచ్ లెవెల్స్ రెగ్యులేట్ అవుతాయి. అలాగే క్రానిక్ డిసీజెస్‌ని ఈ వాటర్ ప్రివెంట్ చేస్తుంది.. మరి ముఖ్యంగా.. వయసు మీద పడకుండా చేయడంలో ఈ వాటర్ చాలా బాగా పనిచేస్తుంది.
ఇంకా చెప్పాలంటే నార్మల్ వాటర్ చేయలేని ఎన్నో పనులను ఈ ఆల్కలైన్ వాటర్ చేస్తుంది. వాటిల్లో ముఖ్యంగా..ఈ ఆల్కలైన్ వాటర్ యాసిడ్ లెవెల్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది.. ఈ పనిని మామూలు వాటర్ చేయలేవు. సరే అయితే..! అంతా బాగానే ఉంది.. కానీ… అసలు ఈ వాటర్ ఎలా తయారవుతాయి..? ఎక్కడి నుంచి వస్తాయి.. తెలుసుకుందాం.. అయొనైజ్ చేసిన వాటర్ నీ ఆల్కలైన్ వాటర్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే వాటర్ యొక్క పీహెచ్ లెవెల్ ని పెంచడమే ఈ ఆల్కలైన్ వాటర్ అంటే..
పీహెచ్ లెవెల్ ని పెంచడం ఏంటి..? అని ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది.. మరేం లేదు..పీహెచ్ లెవెల్ ని ఒక సంఖ్యగా కొలుస్తారు. అంటే …ఈ సంఖ్య ఒక పదార్ధం అని అర్థం. అది ఎసిడిక్ పదార్ధమా, ఆల్కలైన్ పదార్ధమా అని సున్నా నుండి పద్నాలుగు వరకూ ఉన్న స్కేల్‌లో మనకు చెబుతుంది. అంటే, పీహెచ్ లెవెల్ ఒకటి అయితే అది ఎసిడిక్ పదార్ధమనీ, పదమూడైతే బాగా ఆల్కలైన్ పదార్ధమనీ లెక్కిస్తారు. ఇంకా చెప్పాలంటే..నార్మల్ వాటర్ లో పీహెచ్ లెవెల్ ఏడు మాత్రమే.. అదే ఆల్కలిన్ వాటర్ పీహెచ్ లెవెల్ ఎనిమిది లేక, తొమ్మిదిగా ఉంటుంది. అందుకే నార్మల్ వాటర్ ఎసిడిక్ కాదు, ఆల్కలైన్ కాదు, అది న్యూట్రనల్.
అంతే కాదు..ఈ ఆల్కలైన్ వాటర్ తీసుకోవడం వల్ల యాసిడ్ సమస్య తగ్గుముఖం పడుతుంది. ఎసిడిటీ తో బాధపడే వారికి ఈ వాటర్ చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఆసిడ్స్ ని న్యూట్రలైజ్ చేయడం వల్ల కొన్ని రకాల వ్యాధుల నుండి మనల్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా స్పెషల్ ఫిల్టర్స్, ఫాసెట్ ఎటాచ్ మెంట్స్, ఎడిటివ్స్ వంటి వాటి ద్వారా నార్మల్ వాటర్ ని ఆల్కలైన్ వాటర్ గా మారుస్తారు. మన శరీరంలో మనకు తెలియకుండా వివిధ రకాల ద్రవాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి ఎసిడిక్ గా ఉంటాయి కాబట్టి ఆల్కలైన్ వాటర్ ని తీసుకుంటే వీటిని న్యూట్రలైజ్ చేస్తుంది.
రోజు మనం మన ఆహారాన్ని ఇష్టమొచ్చిన పద్ధతిలో తినేస్తూ ఉంటాం.. వాస్తవానికి మన శరీరానికి కావలసిన ఆహారం ఎంతంటే..మనం తీసుకొనే ఆహారం డెబ్భై శాతం ఆల్కలైన్ గా… ముప్పై శాతం ఎసిడిక్ గా ఉండాలి..అలా ఉన్నప్పుడు ఆహారం జీర్ణం అయ్యే ముందు.. శరీరం యొక్క పీహెచ్ లెవెల్ న్యూట్రల్ అవుతుంది. ఇలా పిహెచ్ లెవెల్ బ్యాలెన్స్ చేయని ఫుడ్ తీసుకున్నప్పుడు ఆల్కలైన్ వాటర్ ని తీసుకోమని సజెస్ట్ చేస్తారు.
చాలామందికి నార్మల్ వాటర్ నే మంచిది. అయితే డయాబెటిస్ ఉన్నవారికి ఆల్కలైన్ వాటర్ చాలా హెల్ప్ చేస్తుంది అని వైద్యులు చెబుతున్నారు. ఈ వాటర్ ఎందుకు మంచిది అనే తేల్చి చెప్పే అంత సైంటిఫిక్ రీసెర్చ్ కూడా జరిగింది అంటున్నారు ..కానీ ఈ వాటర్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి అని మాత్రం ఆల్కలైన్ వాటర్ మంచిదని నమ్మే వాళ్ళు మాత్రమే చెబుతున్నారు.