కాంతారా మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ప్రస్తుతం దుమ్ములేపుతోంది. కన్నడ సంచలనం రిషబ్ శెట్టి ఇందులో హీరోగా నటించడంతో పాటు దర్వకత్వం కూడా వహించాడు. కన్నడలో ఇటీవల రిలీజ్ అయిన కాంతారా చిత్రం అక్టోబర్ 15న తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజ్ అయ్యింది.
మొదటి రోజే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో మార్నింగ్ షోలు ఈవెనింగ్ షోలు డల్ గా స్టార్ట్ అయినా ఈవెనింగ్ షోల నుండి తిరుగులేకుండా పోయింది.కాంతార చిత్ర తెలుగు హక్కులను నిర్మాత అల్లు అరవింద్ కొన్నారు.
ఈ క్రమంలో ఆయన భారీ ఎత్తున లాభాలు గడించనున్నారు. కాంతార రైట్స్ కేవలం రూ. 2 కోట్లకు కొన్నట్లు సమాచారం. మొదటిరోజే ఈ మూవీ రూ. 2 కోట్ల షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్ రూ. 5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సెకండ్ డే ఓపెనింగ్ డేకి మించి వసూళ్లు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఫుల్ రన్ లో కాంతార రూ. 10 కోట్లకు పైగా షేర్ వసూలు చేయవచ్చనేది ట్రేడ్ వర్గాల అంచనా. మొత్తంగా అల్లు అరవింద్ డబ్బింగ్ మూవీతో పెట్టుబడికి ఐదారు రెట్ల లాభం పొందనున్నారు. ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సంచలనాలను నమోదు చేస్తుంది. థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా కట్టిపడేస్తుంది.
