Allu Arjun :యుఎస్ టూర్లో అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. పుష్ప చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో భారీ సైన్స్ ఫిక్షన్ మూవీలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ 800 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తోంది.
ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకాస్త టైం పడుతుంది. దీంతో బన్నీ ప్రస్తుతం తన ఫ్యామిలీతో యుఎస్ టూర్ కి వెళ్లారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం అల్లు అర్జున్ ఎక్కడ అని సోషల్ మీడియాలో ప్రశ్నించింది. అల్లు అర్జున్ ప్రశ్నించిన ఆ హీరోయిన్ ఎవరో కాదు పూజ హెగ్డే. బన్నీతో కలిసి దువ్వాడ జగన్నాథం చిత్రంలో నటించింది.
8 ఏళ్ళు పూర్తి చేసుకున్న డీజే
ఈ మూవీ విడుదలై ఎనిమిదేళ్లు పూర్తవుతోంది. దీంతో ఈ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్, దేవిశ్రీప్రసాద్, పూజా హెగ్డే కలిసి పార్టీ చేసుకున్నారు. ఆ ఫోటోని పూజా హెగ్డే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అల్లు అర్జున్ నువ్వు ఎక్కడున్నావ్ అని ప్రశ్నించింది. దీనికి అల్లు అర్జున్ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు. వచ్చే ఏడాది తప్పనిసరిగా మీతో జాయిన్ అవుతాను అని రిప్లై ఇచ్చాడు.

పూజా హెగ్డే రీసెంట్ గా రజినీకాంత్ కూలి చిత్రంలోని మోనిక అనే సాంగ్ తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ సాంగ్లో ఆమె గ్లామర్, డాన్స్ కి యువత ఫిదా అవుతున్నారు. మరోవైపు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంతో బిజీగా ఉన్నారు.