Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ అవార్డు విజేతగా ఎన్నికైన దగ్గర్నుంచి ఆయన విజయ పరంపర మరింతగా కొనసాగుతుంది. ఏకంగా బన్నీ ఆ సినిమాకి నేషనల్ అవార్డును అందుకున్న విషయం మనకు తెలిసిందే. దీంతో బన్నీకి దశ మామూలుగా తిరగలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకొని తెలుగు సినీ ఇండస్ట్రీలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు.
పుష్ప సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో చూసాము. అలాగే పుష్ప 2 సినిమా కూడా విడుదల కాకముందే భారీ బిజినెస్ ని చేస్తుందని చెప్పవచ్చు.ఈ దశలోనే అల్లు అర్జున్ కి మరో గౌరవం దక్కింది. మన తెలుగు సినీ ఇండస్ట్రీలోని మహేష్ బాబు, ప్రభాస్ చేజెక్కించుకున్న ఆ అరుదైన అవకాశాన్ని ఇప్పుడు అల్లు అర్జున్ అందుకొనున్నాడు. అది ఏమిటంటే…
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో( Madame Tussauds Museum ) మైనపు విగ్రహాన్ని కలిగి ఉండటం గొప్ప గౌరవం అని భావిస్తారు. కొంతకాలం క్రితం వరకు ఈ అవకాశం బాలీవుడ్ స్టార్లకే దక్కేది. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లోకి మన సౌత్ ఇండియా స్టార్లు కూడా వెళ్లారు. మహేష్ బాబు, ప్రభాస్ విగ్రహాలు ఇప్పటికే అక్కడ కొలువయ్యాయి.
ఈ మైనపు విగ్రహానికి సంబంధించి కొలతలు ఇవ్వడానికి బన్నీ త్వరలో లండన్ వెళ్తున్నారని వచ్చే సంవత్సరం ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ వార్త ట్రెండింగ్ లో ఉంది. ఈ విషయం తెలియగానే బన్నీ ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు.