వైసిపి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ శనివారం ప్రెస్ మీట్ లో చంద్రబాబు ని చంద్రబాబు అనుచరులని ఒక రేంజ్ లో ఆడుకున్నారు. ఒకదశలో బొత్స వెటకారం చూస్తే రాజశేఖరరెడ్డి హయాం గుర్తొస్తుంది అంటే అతిశయోక్తి కాదేమొ.
అమరావతి ఒక ఫ్లాప్ అయిన సినిమా అనీ.. దానికి నిర్మాత, దర్శకుడు మొత్తం చంద్రబాబునాయుడు అనీ.. ప్లాప్ అయిన సినిమాకి వందరోజులు రెండొదల రోజుల ఫంక్షన్ చేయాలని పరితపిస్తున్న చంద్రబాబు ని చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు.
చంద్రబాబు ఆంధ్రాకి ఒక టూరిస్టు మాత్రమే అని, ఎందుకంటే సొంత ఇల్లు ఇక్కడే ఉండి కూడా గత ఆరు నెలలుగా 15 రోజులు కూడా ఈ రాష్ట్రంలో నివాసం ఉండని వ్యక్తిని టూరిస్టుగానే భావించాల్సి ఉంటుందన్నారు.
అసలు అమరావతిలో ఉద్యమమే లేదు. ఉద్యమం చేయాల్సినంత అవసరం కూడా అక్కడ లేదు. కానీ చంద్రబాబు మాత్రం నలుగురైదుగురు తన సొంత మనుషుల్ని కూడా పెట్టుకుని రౌండ్ టేబుల్ అంటాడు.
చుట్టూ పదిమందిని పెట్టుకుని ఆ టివి కెమేరాలు ముందు కొద్దిసేపు షో చేసి, కెమెరాలు ఉన్నంతవరకూ నిరసన అంటాడు. మొదట్లో 29 గ్రామాలు కాస్తా తర్వత తర్వాత 3 గ్రామాలయ్యాయి. ఇప్పుడు ఆ 3 గ్రామాల కాస్తా 30 మందికి చేరుకుంది. ఇప్పుడు మిగిలిన ఆ 30 మంది రైతులా లేదంటే బాబు సామాజిక వర్గం వాళ్ళో అందిరికీ తెలుసు అని బొత్స సత్యనారాయణ అన్నారు.
బొత్సా నిన్నటి ప్రెస్ మీట్ చూస్తే బాబుమీద పంచ్ లు వేయడానికే పెట్టినట్టుంది. ఈయన ప్రెస్ మీట్ చూసి సోషల్ మీడియాలో మరిన్ని ఇలాంటి ప్రెస్ మీట్ లు పెట్టాలని పోస్ట్ లు పెడుతున్నారు.