Ambati Rambabu’s Satirical Comments on Chandrababu and Prashant Kishore : ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ అంశం పైన మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ కామెంట్స్ చేశారు. వారి కలయిక పైన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అంబటి రాంబాబు చాలా ఆశ్చర్యకరమైన విషయాలను మాట్లాడారు. చంద్రబాబు నాయుడుని, ప్రశాంత్ కిషోర్ కలవడం చాలా ఆశ్చర్యంగా ఉంది.
గతంలో నారా లోకేష్, ప్రశాంత్ కిషోర్ ని ఏ విధంగా మాట్లాడారో మర్చిపోయారు. వీళ్ళు అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరిన తర్వాత మరో లాగా మారుతూ ఉంటారు. చేసిన విమర్శలు గుర్తు చేసుకోవాలి అని చంద్రబాబును దుయ్యబట్టారు అంబటి రాంబాబు. ఇదివరకు చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ ను డేకాయిట్ అని మాట్లాడారు. పీకే ఒక వ్యూహకర్త. ఎంత మంది ప్రశాంత్ కిషోర్ లు, పవన్ కళ్యాణ్ లు వచ్చిన టిడిపిని బతికించే అవకాశం లేదని అంబటి రాంబాబు మీడియా ముఖంగా వెల్లడించారు.
ప్రశాంత్ కిషోర్ వస్తే టిడిపి ఏదో ఎన్నికలలో నెగ్గుతుందని, అత్యుత్సాహంతో ఇలాంటి పనులు చంద్రబాబు చేస్తున్నాడు. కానీ ఇదివరకు వారి రాజకీయ స్వార్థం కోసం ప్రజలను ఏ విధంగా వాడుకున్నారో అవన్నీ ప్రజలు గుర్తు పెట్టుకున్నారు. మీరు ఎంత ప్రయత్నించినా కూడా అధికారంలోకి తిరిగి రాలేరు. ప్రశాంత్ కిషోర్ కోసం ఇప్పుడు ఆయన కాళ్లు పట్టుకోవడానికి అయినా చంద్రబాబు, నారా లోకేష్ సిద్ధంగా ఉన్నారు.
మెటీరియల్ మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేయగలడు. ఇది తెలుగు దేశం కార్యకర్తలు గమనించుకోవాలి. రాబిన్ సింగ్ పని అయిపోయింది అందుకే కొత్త వ్యూహ కర్తను రంగంలోకి చంద్రబాబు దింపుతున్నారు.వ్యూహకర్తలు మారినంత మాత్రాన ఉపయోగమేమీ లేదు. ఆంధ్రప్రదేశ్ లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చంద్రబాబు పైన విరుచుకుపడి, విమర్శలు చేశారు అంబటి రాంబాబు.