Amedkar statue :తుది మెరుగులు దిద్దుకుంటున్న అంబేద్కర్ విగ్రహం… ఈ నెల 14 న అంగరంగ వైభవంగా ఆవిష్కరణ
తెలంగాణా ప్రభుత్వం నూతన సచివాలయం ఎదురుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ పనులు దాదాపు ముగింపు దశకి వచ్చాయి.ఈ నెల 14న అంబేద్కర్ పుట్టినరోజు సందర్బంగా విగ్రహాన్ని ఆవిష్కరణ చేసేందుకు ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తుంది.ఇందులో భాగంగా కళాకారులు అంబేద్కర్ విగ్రహానికి తుడిమెరుగులు దిద్దుతున్నారు.
అయితే నూతనంగా నిర్మిస్తున్న అంబేద్కర్ విగ్రహం దేశ భవిష్యత్ కోసం దిశా నిర్దేశం చేస్తున్నట్లుగా.. ఎడమ చేతిలో రాజ్యాంగం రాసిన పుస్తకం పట్టుకొని, కుడి చేతిని ముందుకు చాచి గొప్ప ఆత్మవిశ్వాసం తో చూస్తున్న అంబేద్కర్ విగ్రహం సచివాలయం దగ్గర ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి చూపరులని విశేషంగా ఆకట్టుకుంటుంది..
అంతేకాకుండా నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణా రాష్ట్ర సచివాలయం భవంతి, మరోవైపు కోట్లాదిమంది తెలంగాణా ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షల కోసం తమ ప్రాణాలని తృణపాయంగా ప్రాణాలు అర్పించిన అమరుల స్మారకం… ఇలా వీటి మధ్య రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం తో కలిపి నెక్లెస్ రోడ్ మరింత చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంది.