• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Entertainment

Anasuya Strong Warning: పబ్లిక్‌పైనే యాంకర్ అనసూయ సీరియస్.. చెప్పు తెగుతుంది.. దగ్గరకొచ్చి మరీ కొడ్తానంటూ..!

Anasuya Strong Warning: పబ్లిక్‌పైనే యాంకర్ అనసూయ సీరియస్..!

Sandhya by Sandhya
August 2, 2025
in Entertainment, Latest News
0 0
0
Anasuya Strong Warning: పబ్లిక్‌పైనే యాంకర్ అనసూయ సీరియస్.. చెప్పు తెగుతుంది.. దగ్గరకొచ్చి మరీ కొడ్తానంటూ..!
Spread the love

Table of Contents

Toggle
  • Anasuya Strong Warning: పబ్లిక్‌పైనే యాంకర్ అనసూయ సీరియస్..!
      • సరిహద్దులు దాటుతున్న ట్రోలింగ్..

Anasuya Strong Warning: పబ్లిక్‌పైనే యాంకర్ అనసూయ సీరియస్..!

 

Anasuya Strong Warning: బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా, వెండితెరపై నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకునే ఈమె.. తాజాగా మరో గొడవలోనూ ఇరుక్కుంది. ఇటీవల ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అక్కడికొచ్చిన కొందరు జనాలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ముఖ్యంగా తన గురించి అసభ్యంగా మాట్లాడిన కొందరు వ్యక్తుల స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చెప్పు తెగుతుంది అంటూ అనసూయ గట్టిగా హెచ్చరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

సరిహద్దులు దాటుతున్న ట్రోలింగ్..

అనసూయ ఎప్పుడూ తన డ్రెస్సింగ్ స్టైల్‌ను బట్టి, మాట్లాడే విధానాన్ని బట్టి తరచుగా ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఆమె పబ్లిక్ ఈవెంట్‌లలో పాల్గొన్నప్పుడు.. అభిమానుల ముసుగులో కొందరు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం, అనవసరమైన కామెంట్లు చేయడం చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి అనసూయ వెళ్లినప్పుడు.. అక్కడికి వచ్చిన కొంతమంది ఆమెపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు.

https://x.com/TEAM_CBN1/status/1951514437237744120?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1951514437237744120%7Ctwgr%5E1a08ac0ec1e47bc4024007f9cfd8c6e530f31649%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fentertainment%2Fcinema%2Fanchor-anasuya-strong-warning-to-youth-who-commented-bad-words-video-gone-viral-215670

ఆ మాటలు విన్న అనసూయ వెంటనే కోపంతో ఊగిపోయారు. ఆమె చేతిలో ఉన్న మైక్‌ను తీసుకొని, అభ్యంతరకరంగా మాట్లాడిన వారిని ఉద్దేశించి గట్టిగా హెచ్చరించారు. “మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో మీ అమ్మ, అక్క, చెల్లి, భార్య ఉంటారు. అలాంటి మాటలు వాళ్లను ఉద్దేశించి కూడా మాట్లాడతారా?” అంటూ అనసూయ ఎదురు ప్రశ్నించారు. “ఎలాంటి మాటలు మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో తెలుసుకోవాలి. లేకపోతే చెప్పు తెగుతుంది” అని గట్టిగా హెచ్చరించారు. అక్కడితో ఆగకుండా ఎంత మంది జనాలు ఉన్న నేను ఆగను.. దగ్గరకు వచ్చి మరీ కొడ్తానంటూ హెచ్చరించారు.

అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలు, పబ్లిక్‌లో మహిళలపై అసభ్యంగా మాట్లాడే వారిపై ఆమెకున్న ఆగ్రహాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. అనసూయ ధైర్యాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మహిళలను ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ఇలాంటి సంఘటనలను చూసీచూడనట్లు వదిలేస్తే, అది మరింత దారుణాలకు దారితీస్తుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయప డుతున్నారు.


Spread the love
Tags: Anasuya Bharadwaj viral videoAnasuya Fires on PublicAnasuya public eventAnasuya strong warningAnasuya Warning VideoAnchor Anasuya Bharadwajఅనసూయ కొత్త వీడియోఅనసూయ వార్నింగ్ వీడియోఅనసూయ వైరల్ వీడియోచప్పుతో కొడ్తానన్న అనసూయ
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.