Vishnu Priya: విష్ణుప్రియ అందాల ఘాటు.. మొత్తం చూపిస్తూ మత్తెక్కిస్తోందిగా
Vishnu Priya: తెలుగు బుల్లితెరపై తన గ్లామర్, జోష్‌ఫుల్ యాంకరింగ్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉండే నటి విష్ణుప్రియ ఇప్పుడు వ్యక్తిగత, వృత్తిపరమైన రెండు అంశాలలోనూ హాట్ టాపిక్‌గా మారారు. ఒకవైపు తన హాట్ ఫొటోషూట్‌తో సోషల్ మీడియాను హీటెక్కిస్తుండగా, మరోవైపు తన వ్యక్తిగత జీవితంలోని అత్యంత సున్నితమైన అంశాలను బయటపెట్టి అభిమానులను ఆశ్చర్యపరిచారు.
యాంకర్ వర్ష హోస్ట్ చేసిన ‘కిసిక్ టాక్ షో’లో అతిథిగా పాల్గొన్న విష్ణుప్రియ, తన ప్రేమ జీవితంలోని విషాదాలను ఎమోషనల్‌గా వివరించారు. సాధారణంగా మోడ్రన్ లుక్స్‌లో కనిపించే ఆమె, ఈ ఇంటర్వ్యూలో సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు.
“నాకు 33 ఏళ్లు. ఈ వయసు వరకు మూడు బ్రేకప్‌లు జరిగాయి. అయితే వాటిలో రెండో బ్రేకప్ నా జీవితంలో పెద్ద షాక్. ఆ తీవ్రమైన బాధ నుంచి బయటపడడానికి నాకు దాదాపు మూడు సంవత్సరాలు పట్టింది,” అని విష్ణుప్రియ వెల్లడించారు. ఆ కష్టకాలంలో తాను మానసికంగా చాలా బలహీనంగా మారానని, ఆ బాధను మర్చిపోయేందుకు ఆధ్యాత్మికతను ఆశ్రయించానని తెలిపారు.
ప్రేమ వైఫల్యం తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లిన తాను, ఆ సమయంలోనే కాశీ యాత్ర చేశానని ఆమె పేర్కొన్నారు. అక్కడి శాంత వాతావరణం, మెడిటేషన్ తనకు ఉపశమనం కలిగించాయని చెప్పారు. “ఇతరులు చేసిన తప్పుకు మన విలువను మనం తగ్గించుకోకూడదు. మన విలువను మనమే తెలుసుకోవాలి” అనే సందేశాన్ని విష్ణుప్రియ ఇచ్చారు. ఆ కష్టకాలమే తనను మరింత బలమైన, మెచ్యూర్డ్‌గా మార్చాయని, తన బ్రేకప్‌లను శాపంగా కాకుండా ఆశీర్వాదంగా చూస్తున్నానని ఆమె చెప్పిన మాటలు యువతకు స్ఫూర్తినిస్తున్నాయి.
వ్యక్తిగత జీవితంలోని సున్నితమైన విషయాలు వైరల్ అవుతుండగానే, విష్ణుప్రియ తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్ అభిమానుల మతి పోగొడుతోంది. స్టైలిష్, బోల్డ్ అవుట్‌ఫిట్‌లో ఆమె ఇచ్చిన పోజులు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఆమె నడుము అందాలతో ఘాటు గ్లామర్‌ను ఆరబోసిన తీరు ‘సింప్లీ వైరల్’ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఒకే సమయంలో ఎమోషనల్ అండ్ గ్లామరస్ పోస్ట్‌లతో విష్ణుప్రియ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
