ఇవాళ ఆంధ్రా యూనివర్శిటీలో హిందీ భవన్ లో నిర్వహించిన బోయ భీమన్న జయంతి కార్యక్రమంలో భాగంగా ప్రసంగం చేసిన ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి, అమరావతి రైతుల పాదయాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు.
విశాఖపట్నం రాజధాని కావాలని ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటి నుండో కోరుకుంటున్నారని, ఇప్పుడు ఉత్తరాంధ్రపై దండయాత్రలు చేస్తామంటే ఊరుకుంటామా అని వీసీ ప్రసాద్ రెడ్డి సభికుల్ని ప్రశ్నించారు.
రాబోయే కాలంలో విశాఖ నే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తున్నాయి. చూడాలి దీనిపై అమరావతి రైతులు ఎలా స్పందిస్తారో.
