Jana Nayagan: విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ ఆడియో లాంఛ్‌పై అనిరుధ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Jana Nayagan: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘జన నాయగన్’. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా విజయ్ కెరీర్‌లో చివరి చిత్రం కానుందనే ప్రచారం సినీ వర్గాలలో జోరుగా సాగుతోంది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
సంగీత ప్రియులను ఎంతగానో అలరించిన అనిరుధ్.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ‘జన నాయగన్’ ఆడియో లాంఛ్ ఈవెంట్ మరియు చిత్రం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
‘జన నాయగన్’ ఆడియో విడుదల కార్యక్రమాన్ని డిసెంబర్ 27న మలేషియాలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఈవెంట్ గురించి మాట్లాడుతూ.. అనిరుధ్, “ఈ ఆడియో లాంఛ్‌ను చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. ఓపెన్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. అభిమానుల కోసం పలు సర్‌ప్రైజ్‌లు సిద్ధంగా ఉన్నాయి,” అని తెలిపారు.
ముఖ్యంగా అనిరుధ్ కూడా విజయ్ కోసం ఒక ప్రత్యేకమైన సర్ప్రైజ్ను ప్లాన్ చేశారట. “విజయ్ సార్ నటనకు వీడ్కోలు చెప్పడం (చివరి సినిమా కావడం) నాకు చాలా బాధగా ఉంది. అందుకే, ఆయన ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఈ వేదికపై ఆయనను ఆశ్చర్యపరుస్తాను,” అంటూ అనిరుధ్ ప్రకటించారు.
ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని మొదటి పాట ‘దళపతి కచేరి’కి ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఆడియో లాంఛ్ సందర్భంగా, అనిరుధ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా, ‘జన నాయగన్’లోని పాటలతో పాటు, విజయ్ గత చిత్రాలు ‘మాస్టర్’, ‘లియో’, ‘బీస్ట్’ సినిమాల్లోని హిట్ సాంగ్స్‌ను కూడా లైవ్‌లో ప్రదర్శించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
విజయ్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ రాజకీయ అరంగేట్రం కారణంగా, ఈ సినిమా ఆయనకు చివరిది అవుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై మరింత ఆసక్తి పెరిగింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘జన నాయగన్’ వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
