Anupama Parameswaran: ‘మంచి మూవీస్ చూడరు.. కమర్షియల్ మూవీ చేస్తే నెగెటివ్ కామెంట్లు చేస్తారు’.. రిపోర్టర్‌పై అనుపమ పరమేశ్వరన్ ఫైర్
Anupama Parameswaran: యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన తాజా చిత్రం ‘కిష్కింధకాండ’ ప్రమోషన్స్‌లో మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఒక విలేఖరి ఆమెను ఉద్దేశించి, ‘టిల్లు స్క్వేర్’ వంటి కమర్షియల్, రొమాంటిక్ సినిమాల్లో అనుపమ నటించడాన్ని ‘జీర్ణించుకోలేకపోయాం’ అని వ్యాఖ్యానించడంపై, నటి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఘాటుగా బదులిచ్చారు.
విలేఖరి వ్యాఖ్యలకు అవాక్కైన అనుపమ వెంటనే స్పందిస్తూ.. “మీరు ‘టిల్లు స్క్వేర్’ చూసి డైజెస్ట్ కాలేదంటారు. కానీ నేను ‘పరదా’ లాంటి ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చేశాను. అది మీరు చూశారా? లేదు కదా! ఎందుకంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చూడటానికి మీరు ముందుకు రారు. అలాంటి సినిమాల గురించి ఎవ్వరూ మాట్లాడరు కూడా” అని సూటిగా ప్రశ్నించింది.
హాట్ టాపిక్స్ ఉన్నప్పుడే విమర్శించడానికి ముందు వరుసలో ఉంటారని, కానీ మంచి సినిమాను ప్రోత్సహించడానికి మాత్రం ఎవరూ రారని అనుపమ చేసిన ఈ వ్యాఖ్యలకు అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. అనంతరం ఆమె నవ్వుతూ సంభాషణను కొనసాగించినా, ఈ రియాక్షన్ వీడియో అభిమానుల్లో వైరల్ అవుతోంది.
అనుపమ ఇచ్చిన ఈ ధైర్యవంతమైన సమాధానానికి సోషల్ మీడియాలో అభిమానుల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. స్టార్ హీరోలు రొమాంటిక్ పాత్రలు చేస్తే దాన్ని ‘యాటిట్యూడ్’ అంటారని, కానీ హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి ప్రశ్నల దాడి ఎందుకు అనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది.
బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి నటించిన అనుపమ తాజా హారర్-థ్రిల్లర్ మూవీ ‘కిష్కింధకాండ’ ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వైవిధ్యమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తున్న అనుపమకు, ఈ సినిమా నటిగా కొత్త పరిణతిని ఇచ్చిందనే చెప్పాలి.