ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా 15 మెడికల్ కళాశాల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, విజయనగరం, మచిలీపట్నం, గురజాల, బాపట్ల, మార్కాపురం, పాడేరు పులివెందుల, నంద్యాల, నర్సీపట్నం, అనకాపల్లి, హిందూపురం, మదనపల్లి ప్రాంతాలలో ఇవి ఏర్పాటు కానున్నాయి. వీటికోసం 16500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. మార్చి 2021 నాటికి వీటి నిర్మాణం పూర్తయ్యేలా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. వీటి నిర్మాణం కొరకు ఇప్పటికే 11 సంస్థలను వైద్య ఆరోగ్య శాఖ ఎంపిక చేసింది.
