Ap Mlc Elections:అసెంబ్లీకి ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా … ఎమ్మెల్సీ గెలుపు అంశంలో బలపడుతున్న అనుమానాలు
తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా Mlc ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, వైసీపీ ఎమ్మెల్యేలు ఓటేశారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇవాళ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మా కొట్టడం తీవ్ర చర్చకి దారి తీసింది.
ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకి వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి,మేకపాటి చంద్రశేఖర్ హాజరు కాకపోవడంతో వీరిద్దరే క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారనే విషయం కన్ఫామ్ అయిందని తోటి వైసీపీ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు.ఉండవల్లి శ్రీదేవి మాత్రం తాను వైసిపికే ఓటు వేశానని చెబుతుండగా,చంద్రశేఖర్ మాత్రం ఓటేసి బెంగుళూరు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండడం విశేషం