AP Politics : ఏలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీని బలపరిచి, కమిటీలు ఏర్పాటు చేసుకోవడం కోసం వెచ్చించే అంత సమయం లేనందున, తమ పార్టీ ఎక్కడైతే బలంగా ఉందొ..అక్కడ పార్టీలతో పొత్తు పెట్టుకొని విజయం వైపు అడుగులు వేసేలాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారు.
అయితే ఐదు జిల్లాల మీద జనసేన నాయకుడు దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. మొదటి నుండి ఉభయగోదావరి జిల్లాలలో, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ ఐదు జిల్లాల మీద జనసేన పూర్తిస్థాయి దృష్టి సారించాయి ,మెజారిటీ సీట్లను జిల్లాల నుండే గెలిచేలా ఆ పార్టీ ప్రణాళికలు చేస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి..
అయితే ఆ భాగంగానే సోదరుడు నాగబాబుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పచెప్పినట్లు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో పార్టీని బలపరిచే బాధ్యతను నాగబాబు తన భుజాల మీద వేసుకొని ,ఇప్పటికే ఆ దిశగా ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నాడని వినికిడి.
ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొననని చెప్తూ వస్తున్న నాగబాబు,అనకాపల్లి నుండి పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడని, అనకాపల్లి నుండి నాగబాబు పోటీ చేయడం దాదాపు ఖరారు అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఉత్తరాంధ్రలో నాగబాబు ఎంపీగా పోటీ చేస్తే ఆ ప్రభావం అక్కడ ఎమ్మెల్యే సీట్ల పైన ,ఓటింగ్ పైన ఉంటుందని జనసేన అంచనా వేస్తున్నట్టు తెలుస్తుంది. పార్టీ విజయం కోసం ఒక్కో అడుగు ఆచితూచి వేస్తున్న పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లా నుంచి కానీ ,పిఠాపురం లేదా కాకినాడ రూరల్ నుంచి లేక, భీమవరం నుండి అయినా
పోటీ చేయొచ్చని కొందరి అంచనా, అయితే పవన్ కళ్యాణ్ మాత్రం పార్టీకున్న పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని పూర్తి రాష్ట్రం మీద సమయం వెచ్చించకుండా, ఎక్కడైతే తమ పార్టీ బలంగా ఉందో ఆలోచనలకు కార్యరూపం ఇస్తూ, అక్కడి నుంచి విజయం సాధించాలని ఆలోచిస్తున్నారు పవన్ కళ్యాణ్.
ఈయొక్క ఆలోచన వైపు వచ్చే ఇది జనసేన పార్టీని విజయం నడిపించే దిశగా వేసే అడుగుల్లో సరైన మార్గమని, ఎన్నికల్లో జనసేన పార్టీ ,అధికార పార్టీకి మంచి పోటీ ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.