Application of six guarantees in Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆరు గ్యారెంటీలను మేనిఫెస్టోలో చేర్చుకొని, వాటిని విరివిగా ప్రచారం చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తానని, ముఖ్య మైన ఎజెండాగా దీనిని ముందు పెడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పాగా వేసింది. అయితే ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు.
దాంతో భాగంగానే చెప్పినట్టుగానే ఆరు గ్యారెంటీలను అమలుపరిచే విధంగా ఆయన ఆచరణ మొదలుపెట్టారు. అయితే అధికారంలోకి రాకముందు చాలా రకాల మాటలను చెబుతారు. అధికారం వచ్చిన తర్వాత మాట మారడం రాజకీయా నాయకులకు అలవాటే అని అందరూ అపోహ పడతారు. కానీ ఆ ఆపోహలను పారదోలుతూ రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలను అమలు చేయడం కోసం ముందస్తు ప్రణాళికని సిద్ధం చేసుకున్నారని చెప్పవచ్చు.

ఇప్పుడు ఆరు గ్యారంటీలతో ప్రజలలో అభివృద్ధిని చూడాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి ప్రజలు ఏవేవి జతపరచాలి, ఏ రకంగా దరఖాస్తు చేసుకోవాలి అనే అంశం పైన కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టతను ఇచ్చింది. ఆరు గ్యారంటీల పథకంలో దరఖాస్తు చేసుకోవడానికి ఫారం విడుదలను చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఈ దరఖాస్తుకు ఫారం ప్రకారం సిద్ధంగా ఉంచుకోవలసినవి ముఖ్యంగా.. దరఖాస్తుదారు ఫోటో, ఆధార్ కార్డు (జత చేయాలి) రేషన్ కార్డు, జత చేయాలి. ఫోన్ నెంబరు, కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్లు, గ్యాస్ కనెక్షన్ నెంబరు, గ్యాస్ ఏజెన్సీ పేరుతో పాటు, పట్టాదారు పాసుపుస్తకం నెంబరు, సర్వే సంఖ్య, విస్తీర్ణము, వ్యవసాయం, కూలీ, జాబ్ కార్డు నెంబరు, గృహ విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబరు, ఒకవేళ దివ్యాంగులు అయితే సదరం సర్టిఫికెట్, నెంబరు అన్ని సక్రమంగా మెన్షన్ చేయాలని వెల్లడించారు.
