శ్రీకాకుళం: అరసవిల్లిలోని సూర్య దేవాలయం సూర్య నారాయణ స్వామి విగ్రహంపై సూర్యకిరణాలు తాకిన అద్భుత ఘట్టం శనివారం అక్టోబర్ 1వ తేదీన జరగడంతో భక్తులు ఆ దివ్య ఘట్టాన్ని తిలకించేందుకు బారులు తీరారు. సూర్యకిరణాలు గర్భగుడిలో సూర్యనారాయణ స్వామి తల నుండి పాదాల వరకు తాకాయి.
సూర్యుడు ఉత్తరాయణం (ఉత్తర గోళం) మరియు దక్షిణాయనం (దక్షిణార్ధగోళం)లోకి ప్రవేశించినప్పుడు మాత్రమే ఈ అద్భుత దృశ్యం కనువిందు చేస్తుంది. సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే ఇలా సంభవిస్తుంది. అక్టోబరులో దక్షిణాయణం కారణముగా 1,2 మరియు 3 తేదీలలో సూర్యకిరణాలు విగ్రహంపై పడతాయి అలాగే మార్చి 8,9 మరియు 10 తేదీలలో ఉత్తరాయణం సందర్భంగా సూర్యకిరణాలు విగ్రహం మీదపడతాయి.
