Arcturus : కరోనా వైరస్ కొత్త, కొత్త రూపాలతో మనల్ని పలకరిస్తూనే ఉంది. మొన్నటి వరకు ఒమిక్రాన్ పేరుతో మన చుట్టూనే ఉంది. ఇప్పుడు మళ్లీ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ గా ఇంకో రూపంతో మన ముందుకు వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. ఈ వేరియంట్ పేరు ఆక్టురస్. ఇది ఒమిక్రాన్ కి సబ్ వేరియంట్. దీనికి మరోపేరు ఎక్స్‌బీబీ.1.16(XBB.1.16)
దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో రూపంలో వైరస్ దాడి చేయడం అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తుంది . ఆక్టురస్ వేరియంట్ ని మొదటిగా భారత దేశంలో 2023న కనుగొన్నారు. ఇది ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీని ప్రభావం ఎక్కువగా వృద్దులు, పసిపిల్లల పైన ఉంటుందని వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మన దేశ రాజధానిలో ఈ వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉంది. అందరూ అప్రమత్తమై జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అక్టురస్ లక్షణాలు : ఒళ్ళునొప్పులు, విపరీతమైన జ్వరం, దగ్గు, ఆయాసం, తలనొప్పి, జలుబు, చాతిలో నొప్పి ఇవన్నీ కూడా అక్టురస్ లక్షణాలు. చిన్న పిల్లల్లో అయితే అధిక జ్వరం, ఆయాసం, విపరీతమైన కళ్ల మంటలు, ఈ వైరస్ కి సూచనలు. ఇవి గమనించిన వెంటనే హాస్పిటల్‌లో చేరితే తగ్గే అవకాశాలు ఎక్కువ అని వైద్యులు సలహా ఇస్తున్నారు.
అలాగే రద్దీగా ఉండే ప్రదేశాలలో తిరగకపోవడమే మంచిది. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించాలి. చేతులను ఎప్పటి కప్పుడు శుభ్రం చేసుకోని, శానిటైజర్ వినియోగించాలి. బూస్టర్ డోస్ టీకాలు వేసుకోవాలి, ఇదివరకు కోవిడ్ నిబంధనలు ఎలాగైతే పాటించాలో అలాగే ఈ ఆక్టురస్ వైరస్ కి సంబంధించి కూడా నిబంధనలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
