Artisans Maha Dharna:”ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమ ఉదృతి” ని మరోసారి గుర్తుచేసిన విధ్యుత్ ఆర్టిజన్ల మహా ధర్నా…
నేడు ఖైరతాబాద్ లోని విధ్యుత్ ప్రధాన కార్యలయం ముందు జరిగిన విధ్యుత్ ఆర్టిజన్ ల “చలో విధ్యుత్ సౌధా” మహా ధర్నా తీరు చూస్తుంటే.. మొన్నటి తెలంగాణా ఉద్యమ ఉదృతే గుర్తుకువచ్చింది అంటే ఆశ్చర్యం లేదేమో..అంతలా భారీ జనసమీకరణతో దిక్కులు పిక్కటిల్లేలా నినదించిన విధ్యుత్ కార్మికుల హోరుతో హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.దాదాపుగా 30,000 వేల మంది పాల్గొన్నారని, తెలంగాణా వచ్చినప్పటి నుండి ఇంత పెద్ద ఎత్తున జనప్రభంజనం ఎప్పుడూ చూడలేని విధంగా సాగింది ఈ రోజు ధర్నా..
తమ న్యాయమైన డిమాండ్లతో పాటు, సియం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఈరోజు విధ్యుత్ ఆర్టిజన్ లు తలపెట్టిన కార్యక్రమం విజయవంతం అయింది.. ఎటు చూసినా రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన విధ్యుత్ కార్మికులతో ఖైరతాబాద్ లోని విధ్యుత్ ప్రధాన కార్యాలయం చుట్టూ ఉన్న పరిసరాలు కిక్కిరిసిపోయాయి.ఈ ధర్నాతో దాదాపుగా ఖైరతాబాద్ పరిసరాలు మొత్తం ట్రాఫిక్ వల్ల స్తంభించిపోయాయి.. గతంలో తెలంగాణా ఉద్యమం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ఉద్యమాలు చూశాం, తెలంగాణా వచ్చాక కూడా ఇలాంటి ఉద్యమం చూడడం ఇదే మొదటిసారి అని స్థానికులు చర్చించుకోవడం చూస్తుంటే ధర్నా ఏ స్థాయిలో జరిగిందో అర్ధం అవుతుంది.
ఈ సందర్బంగా విధ్యుత్ ఆర్టిజన్లు మాట్లాడుతూ “మాకు నూతన Prc అమలుతో పాటు రెగ్యులర్ ఉద్యోగుల తరహా Apseb రూల్స్, కన్వర్సన్, ఫిట్మెంట్ 40% వెంటనే ఇవ్వాలని.. అలాగే సియం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి” అని నినదించారు. లేని పక్షంలో త్వరలోనే సమ్మె చేయడానికి కూడా వెనుకాడబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఏదేమైనా ఈరోజు జరిగిన విధ్యుత్ ఆర్టిజన్ ల మహా ధర్నా, తెలంగాణా ఉద్యమ రోజుల్లోకి తీసుకెళ్ళింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అన్నది ముమ్మాటికీ వాస్తవం.