దక్షిణ భారతదేశంలోని కేరళలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం కి సంబంధించిన ట్రావెన్‌కోర్ దేవాసమ్ బోర్డు (TDB) ముఖ్యమైన సమాచారం విడుదల చేసింది.
మార్చి 24 నుండి ఇండియాలోని అన్ని పుణ్యక్షేత్రాలు లాక్ డౌన్ కారణంగా మూతపడిన సంగతి మన అందరికి తెలిసిందే.. అయితే అన్ లాక్ మొదలయ్యాక చాలా చోట్ల ఆలయాలు తేరుచుకోవడం మొదలైంది. తెలుగు రాష్ట్రాలలో, తమిళనాడు, కర్నాటక లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు దాదాపు అన్నీ తెరుచుకున్నాయి కానీ కేరళాలోని శబరిమల ఆలయం పై మాత్రం క్లారిటీ రాలేదు.
అయితే ఇప్పుడు కేరళా లోని మళయాళం నెల తులం సందర్భంగా అక్టోబర్ 16 నుండి ఐదురోజులు పాటు శబరిమల ఆలయం తెరుస్తున్నట్టు ఆలయ బోర్డు ప్రకటించింది. ప్రతిరోజు 250 మందిని మాత్రమే కొండమీదకి అనుమతిస్తున్నట్టు ఆలయ బోర్డు ప్రకటించింది. కఠినమైన సామాజికదూర నిబంధనలు పాటిస్తూ ఈ ఐదురోజులు పూజలు నిర్వహిస్తారు అని ట్రావన్కోర్ దేవాస్ బోర్డు ప్రకటించింది. అలాగే ఎవరైతే ముందుగా ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే కొండమీదకి అనుమతి ఉంటుందని, పైగా కొవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ ఉన్నవారికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు ఆలయ నిర్వాహకులు.
కాగా నవంబర్ 16 నుండి రెండు నెలలు పాటు ఆలయం తెరిచిఉంచుతారని, డైలీ 1000 మంది మాత్రమే అనుమతిస్తారని, అయితే ప్రతీ ఒక్కరూ కొవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి అని ట్రావన్కోర్ దేవాస్ బోర్డ్ ప్రకటించింది. నవంబర్ తర్వాత శని ఆదివారాలలో 2000 మంది కి అనుమతి ఉన్నట్టు కూడా తెలిపారు.