Bachelors : పురాతన కాలంలో అయితే ఆడపిల్ల అని తెలిస్తే పురిటీలోనే చంపేసేవారు..రాను,రాను కాలం మారి టెక్నాలజీ మారుతుంటే ఆడపిల్లల మరణాల రేటు కూడా తగ్గుతూ వచ్చింది. అయితే అప్పట్లో పురాతన కాలంలో ఆడపిల్లల మరణాలు ఎక్కువ ఉండి పెళ్లి విషయంలో పెళ్లికూతురు దొరకడం కష్టంగా ఉండేది. కానీ ఈ టెక్నాలజీ పెరిగిన కాలంలో కూడా పెళ్లికూతురు దొరకట్లేదు అంటే ఆలోచించాల్సిన విషయమే.
ఈ మధ్యకాలం వరకు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే కట్నాలు, జాబులు, కానుకలు అన్ని సరిగా ఉంటేనే పెళ్లిళ్లు జరిగేవి. కానీ ప్రస్తుతం సమాజంలో సిన్ మొత్తం రివర్స్ అయింది. ఇప్పుడు అబ్బాయిలకు, అమ్మాయిలు దొరకడం కష్టంగా అయిపోయింది. సగటున వందమంది అబ్బాయిలకు 90 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు.

గతంలో పెళ్లి వయసు 18 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు అమ్మాయిల పెళ్లి వయసు పెరిగింది. ప్రస్తుత సమాజంలో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా దేంట్లోను తక్కువగా ఉండట్లేదు. అన్నిట్లోనూ సమాన స్థాయిని అందుకుంటున్నారు. ఉద్యోగాలు, చదువు విషయంలో కూడా వాళ్ళు ఎంతో ప్రతిభతో ముందుకు దూసుకెళ్తున్నారు.
అబ్బాయిలతో పాటు సమానంగా ఉద్యోగాలు చేస్తూ వాళ్లు పరిణితి జ్ఞానం వచ్చాకనే పెళ్లి చేసుకుంటున్నారు. ఓ రకంగా చెప్పాలంటే అబ్బాయిలకు పెళ్లిళ్లు కాకపోవడానికి ఇదొక ముఖ్య కారణం అని చెప్పొచ్చు. అబ్బాయిలు కొంచెం జాగ్రత్త పడి, సంబంధం వచ్చిన వెంటనే పెళ్లిళ్లు చేసుకోవడం బెటర్. అమ్మాయి నచ్చలేదు, కట్నకానుకలు సరిపోలేదు అంటే మాత్రం..మీరు ఇక జీవితాంతం బ్రహ్మచారిగా ఉండి పోవాల్సి వస్తుంది.
