Baldness : మోడ్రన్ లైఫ్ స్టైల్లో జుట్టు రాలడం అనేది ప్రధాన సమస్యగా మారింది. ఈ మధ్య ముఖ్యంగా మగవారిలో బట్టతల ఎక్కువగా వస్తుంది. ఈ సమస్య ఆడవాళ్ళ కంటే మగవారిలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ బట్టతలకు ముఖ్య కారణాలు సరైన ఆహారం తీసుకోకపోవడం, జుట్టుపైన సరైన శ్రద్ధ పెట్టకపోవడం.
బట్టతల ఏర్పడడానికి ముందు తలలో పూర్తిగా వెంట్రుకలు ఊడిపోవడం లేదా పల్చబడడం జరుగుతుంది. ఇలా మారడాన్ని “అలోపేషియా” అని పిలుస్తారు. వెంట్రుకలు పూర్తిగా రాలిపోయి ఆ ప్లేస్ అంతా బట్టతలగా మారిపోతుంది.
మగవారిలో బట్టతల రావడానికి కారణాలు..
★ స్త్రీలలో మాదిరిగానే పురుషుల్లో కూడా హార్మోలలో మార్పులు జరుగుతుంటాయి. ఏజింగ్, అనుకోకుండా బరువు తగ్గడం, ఐరన్, హెరిడిటీ, ప్రోటీన్ లోపాలు వల్ల బట్టతల ఏర్పడుతుంది.
★ ఎక్కువగా పురుషులు మద్యం సేవిస్తూ ఉంటారు, డ్రగ్స్, సిగరెట్ తాగడం వల్ల కూడా బట్టతల ఏర్పడుతుంది.
★ మగవాళ్లకి వృషణాల నుంచి ఎడ్రినల్ గ్రంధులు విడుదలచేసే టెస్టోస్టెరాన్ హార్మోన్, అలానే కిడ్నీలపై ఉండే ఎడ్రినల్ గ్రంథులు విడుదల చేసే, హార్మోన్స్ అవసరానికి మించి ఉత్పత్తి అయినప్పుడు.. జుట్టు కుదుళ్లు కృశించుకుపోయి బట్టతల ఏర్పడడానికి సహకరిస్తాయి.
★ పురుషుల్లో, ఆడవాళ్ళతో పోల్చుకుంటే కోపం, స్ట్రెస్, భయం, కంగారు ఎక్కువగా ఉంటుంది. వీటి ద్వారా కూడా బట్టతల వీళ్ళల్లో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది.
★ మగవారిలో శృంగార కోరికలు ఎక్కువగా ఉన్నప్పుడు.. టెస్టోస్టెరాన్ హార్మోన్ విడుదలవుతూ ఉంటుంది. ఇది అధిక మోతాదులో విడుదల కావడం కూడా బట్టతలకు కారణం.
ఆడవాళ్ల లో బట్టతల రాకపోవడానికి కారణాలు..
★ మగవాళ్ల తో పోల్చుకుంటే ఆడవారికి ఓర్పు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువశాతం సైలెంట్ గా, ప్రశాంతంగా ఉంటారు. స్ట్రెస్ కూడా తక్కువగా తీసుకుంటారు అందువల్ల బట్టతల వచ్చే ఛాన్సెస్ లేవు.
★ స్ట్రేస్ తక్కువగా ఫీల్ అవడం వల్ల కిడ్నీలపై ఉండే గ్రంథులు యాండ్రోజనిక్ హార్మోన్స్‌ను ఎక్కువగా ప్రొడ్యూస్ చెయ్యవు. అందుకే వారు ఈ బట్టతల విషయంలో సేఫ్.
పైన చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకొని అబ్బాయిలు కాస్త ఆ ఆలోచనలు అదుపు చేసుకోని. నీరు ఎక్కువ తాగడంలాంటివి చేస్తే ఈ బట్టతల నుండి కాస్త అయిన తప్పించుకోవడానికి వీలు ఉంటుంది అని వైద్య నిపుణులు చెబుతున్నారు.