బిగ్ బాస్ షోలోని అశ్లీలతపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిగ్‌బాస్ అశ్లీలత పెరిగిందంటూ రియాల్టీ షోను బ్యాన్ చేయాలని దాఖలైన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపింది. న్యాయవాది శివప్రసాద్ రెడ్డి బిగ్‌బాస్ రియాల్టీ షోలో ఐబీఎఫ్ గైడ్లైన్స్ పాటించలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అశ్లీలత ఎక్కువగా ఉందని వాదించారు.
దీనికి ఏపీ హైకోర్టు 1970ల్లో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా అంటూ గుర్తు చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది స్పందిస్తూ, దీనిపై కొంత సమయం కావాలని కోరారు. పూర్తి వివరాలతో వివరణ ఇస్తామని చెప్పారు. మరోవైపు హైకోర్టు విచారణను అక్టోబర్11కు వాయిదా వేసింది.
