Ban Vs Eng 1st T20:T20 ఛాంపియన్ ఇంగ్లాండ్ కి పసికూన షాక్… తొలి T20 లో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి
T20ల్లో ప్రపంచ చాంపియన్ అయిన ఇంగ్లాండ్ కి పసికూన బాంగ్లాదేశ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
గురువారం జరిగిన మొదటి T20 మ్యాచ్ లో బంగ్లా 6 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ని మట్టి కరిపించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీం 20 ఓవర్లలో 6 వికెట్లకి 156 పరుగులు మాత్రమే చేసింది. జోస్ బట్లర్ (42 బంతుల్లో 67), ఫిల్ సాల్ట్ (35 బంతుల్లో 38) మాత్రమే రాణించారు.
అనంతరం 157 పరుగుల విజయలక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ కేవలం 18 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు సాధించి అద్భుత విజయం సాధించింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నజ్ముల్ హుస్సేన్ (30 బంతుల్లో 51), షకీబల్ హసన్ (24 బంతుల్లో 34) బంగ్లా విజయంలో కీలకపాత్ర పోషించారు. T20 ల్లో ఇంగ్లాండ్ పై బంగ్లాకి ఇదే మొదటి విజయం కావడం విశేషం