Basara Temple Development – బాసరకి మహర్దశ
చదువుల తల్లి “సరస్వతి” కొలువైన క్షేత్రం బాసర.. పిల్లలకు అక్షరాభ్యాసం చేసే ప్రసిద్ధ దేవాలయాలలో బాసర ఒకటి.. వ్యాస మహర్షి ప్రార్ధనలతో గణనీయమైన సమయం ఇక్కడ గడిపినందుకు “వాసర” గా అదే కాలక్రమేణా బాసరగా మారింది అని చెబుతారు. ఇది తెలంగాణా లోని నిర్మల్ జిల్లాలో నిర్మల్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరం లో.. హైదరాబాద్ కి 200 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది..
బాసరను అభివృద్ధి చేస్తా అని గతంలో హామీ ఇచ్చిన కేసీయార్ ఇపుడు కార్యాచరణకి సిద్ధం అయ్యారు.
ఈ ఆలయాన్ని సరికొత్త హంగులతో నిర్మించేందుకు ఆయన ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందుకు కర్ణాటకలోని శృంగేరి పీఠం నుండి అనుమతి తీసుకొని మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని భావిస్తున్నారు.

ఇప్పటికే కేసీయార్ ప్రభుత్వం 50 కోట్లు కేటాయించగా..అందులో 8 కోట్లతో ఆలయ పరిసరాల్లోని గెస్ట్ హౌస్ లకి మరమ్మత్తులు పూర్తి చేశారు. అలాగే ఇప్పుడున్న ప్రాకార మండపాన్ని పూర్తిగా తొలగించి కొత్త మండపాన్ని నిర్మించే ప్రణాళిక రూపొందుతోంది.
