మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఆహారం విషయంలో కొంచెం అజాగ్రత్తగా ఉన్నా అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే. కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం వలన మతిమరుపు వస్తుందని ఒక పరిశోధనలో తేలింది. ఈ మెమరీ స్నాచింగ్ ఫుడ్ అలవాటు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి ఆహారాలకి దూరంగా ఉండటం ఉత్తమం. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
వాస్తవానికి బయటి ఆహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. బర్గర్, చిప్స్ లాంటి ఆహారాలు మతిమరుపుకు కారణమవుతున్నాయి. వీటిని ప్రిజర్వేటివ్ ఫుడ్ అని పిలుస్తారు. బ్రిటన్‌లో ఈ రకమైన ప్రాసెస్డ్ ఫుడ్‌కు సంబంధించిన పరిశోధనలు జరిగాయి. దీని ప్రకారం ఈ ఆహారాలు తినడం వల్ల శరీరంలో 400 నుంచి 500 కేలరీలు అందుతాయి. ఈ పరిశోధన సుమారు 8 సంవత్సరాలు జరిగింది. ఇందులో 10,775 మంది పురుషులు, మహిళలు పాల్గొన్నారు.
బర్గర్లు, చిప్స్ జ్ఞాపకశక్తిపై చెడు ప్రభావం చూపుతుందని పరిశోధనలో వెల్లడైంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ రకమైన ఆహారాన్ని తినే వారిలో ఇతరులతో పోలిస్తే 28 శాతం ఎక్కువ మతిమరుపు రేటు ఉంటుంది. అయితే ఈ రకమైన ఆహారం ప్రజల రోజువారీ ఆహారంలో 50 శాతం ఉంటుంది. దీనివల్ల చాలామంది మతిమరుపుకి గురవుతున్నారు. జ్ఞాపకశక్తి కోల్పోకుండా ఉండాలంటే రోజూ వాకింగ్, హెల్తీ డైట్ రొటీన్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
