క్యారెట్ అన్ని సీజన్లలోనూ దొరుకుతుంది. మిగతా కూరగాయలైతే వండుకొని తినాలి కానీ.. క్యారెట్ అయితే పచ్చిగానే తినొచ్చు. మంచి టేస్టీగా ఉంటుంది. చాలామంది కూర చేసుకొని తినడం కంటే క్యారెట్ ను పచ్చిగానే తినడానికి ఇష్టపడతారు. క్యారెట్‌లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి(Benefits of eating raw carrots). ప్రధానంగా కంటి ఆరోగ్యానికి క్యారెట్ ఎంతగానో మేలు చేస్తుంది. మన శరీరానికి కావలసిన పోషకాలను పచ్చి క్యారెట్లు తింటే లభిస్తాయి. క్యారెట్‌లు అనేక ఫైటోకెమికల్స్‌ని కలిగి ఉంటాయి.
ఈ సమ్మేళనాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. క్యారెట్ నుండి వచ్చే రసం లుకేమియాను కూడా ఎదుర్కోగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. క్యారెట్లు విటమిన్ ఎ, సి, కెరోటినాయిడ్స్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్ల శక్తి కేంద్రాలు. కనుక కేశ సంపదకు మేలు చేస్తుంది. క్యారెట్ రసంలో ఫైబర్, పొటాషియం, నైట్రేట్లు, విటమిన్ సి, ఇతర పోషకాలు రక్తపోటును అదుపులో వుంచుతాయి.
Also Read: ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే.. దేనికి సంకేతమో తెలుసా..!?
కప్పు క్యారెట్ రసంలో గ్లాసు పాలు, కొద్దిగా తేనె కలిపి పది బాదం పప్పులతో పాటు తీసుకుంటే ఆలోచనాశక్తి, జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. శుభ్రంగా కడిగిన పచ్చి క్యారెట్ దుంపను తింటే నులిపురుగు లాంటి సమస్యలు తొలగడంతో పాటు, రక్తం శుభ్రపడుతుంది. మూత్రశయం, మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు మిగతా మందులతో పాటు క్యారెట్‌ను సేవిస్తే మేలు చేస్తుంది. కళ్ల సమస్యలకు క్యారెట్ తో చెక్ పెట్టొచ్చని అందరికీ తెలిసిందే.
Benefits of eating raw carrots: Carrots are loaded with Vitamin A, and beta-carotene Carrots also help maintain healthy cholesterol and prevent heart diseases.