Benefits of Fasting : పూజల చేసేవారు వారంలో ఉపవాసం ఉంటూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఉపవాసం ఉండాలా.. వద్దా..? ఉంటే ఎలా పాటించాలి. దానికి ఏమైనా నియమాలు పెట్టుకోవాలా..? ఇలాంటి అనుమానాలను ఇప్పుడు నివృత్తి చేసుకుందాం. ఉపవాసం ఉండడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి అని చెప్తున్నారు వైద్య నిపుణులు.
ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థ పై ఏమాత్రం ప్రభావం చూపకుండా, మన శరీరంలో ఉన్నటువంటి మంట, వాపులను తగ్గిస్తుంది అంట, ఇన్ఫెక్షన్ సోకినప్పుడు రోగనిరోధక వ్యవస్థ చేసే మొట్టమొదటి పని ఈ మంట ,వాపులను తగ్గించడం. ఇది ఎక్కువ కాలం ఉంటే గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి జబ్బులు వచ్చే ప్రమాదాలు ఉంటాయి. అయితే శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం మానవ ఎముకలు నిరోధక వ్యవస్థ, కణాలపై అధ్యయనం చేసిన క్రమంలో కొన్ని విషయాలు వెళ్లడయ్యాయి.
ఉపవాసం ఉన్నప్పుడు ఒక రకమైన మంట,వాపులకు కారణమయ్యే మోనోసైట్స్ ఉపవాస సమయంలో నిద్రాణ స్థితికి చేరుకుంటుంది. దానివల్ల ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చు అని వారు వెల్లడించారు. ఉపవాసం అంటే తేలికగా ఉండి, భగవంతునికి సమీపంగా ఉండడం అర్దమని అందరూ భావిస్తారు. ఉపవాసం వల్ల మన దృష్టి కేవలం భగవంతునిపై కేంద్రీకృతమై ఉండి, మనం ఒక
ఆధ్యాత్మికతలో ఉంటామని, ఏకాగ్రతతో కూడిన జ్ఞానం వలన మానసిక దృఢత్వం మనలో పెరిగి, శరీరకణాలలోని జీవక్రియలు ఉత్తేజితమై, చైతన్య ప్రేరణ కలుగుతుందని, అలాగే దీర్ఘాయునకు పెద్ద పీఠా ఉపవాసం. చాలామంది మంచినీళ్లు కూడా తాగకుండా కఠోర ఉపవాసం చేస్తుంటారు. వారానికి ఒకసారి లేదా నెలకు రెండుసార్లు ఉపవాసం చేయడం మన ఆరోగ్యానికి మంచిది.
నిజానికి ఉపవాసంలో ఏమి తినకూడదు అన్న నిబంధన ఏమీ లేదు. కాకపోతే కడుపునిండా తినకుండా ఉంటే, నిద్ర రావడం, ప్రకృతి అవసరాల కోసం సమయం కేటాయించడం వంటివి చేయగలుగుతాం. వీటన్నింటినీ ఎక్కువ సమయం గడిపే అవకాశం కూడా మనకు లభిస్తుంది. ఉపవాసం రోజున భోజనం మానేసే సాంప్రదాయం, దైవ కోసం సమయాన్ని కేటాయించడంలో భాగంగానే ఏర్పడింది. ఉపవాసం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. పగలంతా ఘనపదార్థాలు తినకుండా ఉండడం, కేవలం ద్రవపదార్దాలతో చేసిన ఉపవాసం వల్ల జీర్ణ క్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది.