Benefits of Raw vegetables : మనం ఆరోగ్యంగా, బలంగా ఉండాలి అంటే.. క్రమం తప్పకుండా పండ్లు కూరగాయలు తీసుకోవాలి. ఇవి మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. అయితే ఎవరైనా సాధారణంగా కూరగాయలను ఎలా తింటారు? వండుకొనే కదా.. అయితే కూరగాయలను వాడడం ద్వారా అందులోని పోషకాలు నశిస్తాయి అంటున్నారు పోషకాహార నిపుణులు. అందుకే కూరగాయలను పచ్చిగానే తినాలట తద్వారా కలిగే ప్రాయోజనాలేంటో చూద్దాం..
టమాటా:
సహజంగా టమాటను అనేక కూరగాయలతో కలిపి వండుతారు. టమాటలోని అస్సలైన పోషకాలను పొందాలి అంటే మాత్రం దాన్ని సలాడ్ రూపంలో తీసుకోవాలి. టమాటాలను వండిన తర్వాత అందులోని పోషకాలు పూర్తిగా నశిస్తాయి. అందుకే పచ్చిగా తింటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
బ్రోకలీ:
బ్రోకలీ ఆరోగ్యకరమైన మరియు పోషకాలతో కూడిన కూరగాయల్లో ఒకటి. దీన్నీ సలాడ్ రూపంలో తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాన్ని పొందవచ్చు. బ్రోకలీని ఉడికించాలనుకుంటే కొంచెం ఉప్పును మాత్రమే వాడాలి. దీనిలోని పోషకాలను పూర్తిగా పొందాలంటే.. పచ్చిగానే తినాలి.
ఉల్లిపాయ:
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటుంటారు. వెజిటబుల్ గ్రేవీ తయారీలో ఎక్కువగా వాడే ఉల్లిపాయను.. పచ్చిగా తింటేనే మంచిది. దీనిని సలాడ్ రూపంలో తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఎందుకంటే ఉల్లిపాయల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉల్లిపాయలను పచ్చిగా తినడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.
బీట్‌రూట్:
బీట్‌రూట్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని పచ్చిగా తింటే అధిక ప్రయోజనాలు లభిస్తాయి. పచ్చి బీట్‌రూట్ తినడం వల్ల రక్తపోటును నియంత్రిస్తుంది.