Benefits of Vegetarianism : మనదేశంలో మాంసాహారం కంటే కూడా శాఖాహారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు ఉన్నారు. ఎందుకంటే మాంసాహారం మీద అయీష్టత కావచ్చు, శాకాహారం మీద మక్కువ కూడా కావచ్చు, మాంసాహారం కంటే కూడా శాఖాహారం తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఇదొక కారణం కూడా కావచ్చ అయితే ప్రపంచం మొత్తంలో మాంసాహారం కంటే కూడా శాఖాహారం తినేవారి జాబితాలో మన భారత దేశమే మొదటి స్థానంలో ఉంది.
భారతదేశంలో సాంప్రదాయాలు ఎక్కువ.ఈ కారణంగా కూడా మాంసాహరనికి దూరంగా ఉంటున్నారు. అయితే భారత దేశంలో 30 శాతం మంది శాకాహారులుగా ఉన్నారు. అంటే దాదాపు 45 కోట్లకు పైగా మన దేశంలో శాఖాహారులు అన్నమాట. ఇక భారత దేశం తర్వాత ఇజ్రాయిల్ దేశంలో శాకాహారుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి మతపరమైన జీవనశైలి కారణం, ఒకటైతే ఇంకొక కారణం జుడాయిజం.
శాకాహార తినడం వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ చేరకుండా ఉంటుంది. అలాగే గుండె కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మాంసాహారం తినడం వల్ల శరీరంలో డ్రై గ్లిజరైట్స్ పెరగడమే కాకుండా, చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. అది మన గుండెకు అస్సలు మంచిది కాదు. శాఖాహారం తినేవారికి డయాబెటిస్ వచ్చే అవకాశం చాలా తక్కువ. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కూడా మాంసాహారానికి దూరంగా ఉండడం ఉత్తమం.
ఎందుకంటే మొక్కల ఆధారిత ఆహారం వాటిల్లో ఉండే కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి శాఖాహార తినడం వల్ల మనం బరువు కూడా పెరగకుండా ఉంటాము. అయితే శాకాహార తినడం వల్లకు అల్జీమర్స్, జ్ఞాపకశక్తి తగ్గడం వంటివి రాకుండా ఉంటుంది. శాఖాహారం మంచి ఆరోగ్యకరమైన ఆహారం. మాంసాహారం ఆధారిత ఆహారం కార్బన్ ఉద్గారాలను రెండున్నర రెట్లు పెంచుతుంది.