Viral Videos : కర్ణాటక బెంగళూరులో ఓ పెళ్లికూతురు వీడియో సామాజిక మధ్యమాల్లో తెగ వైరల్ గా మారింది. ఆమె తన కారును రోడ్డుపైనే వదిలిపెట్టి మెట్రోలో ప్రయాణించి పెళ్లి మండపానికి చేరుకుంది. సరిగ్గా మూహూర్తం టైంకు అక్కడకు వెళ్లింది. ఒంటినిండా నగలు, మేకప్ తో పెళ్లికుతూరు తన వాళ్లతో కలిసి మెట్రోలో ప్రయాణించడం చూపరులను ఆకర్షించింది.
అయితే దీనికి కారణం లేకపోలేదు. బెంగళూరులో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడం సహజమే. ఈ పెళ్లికుతూరు కారు కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. ఎంతసేపైనా ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఓ వైపు ముహూర్తం టైం దగ్గరపడుతోంది. దీంతో ఆమె తెలివిగా ఆలోచించి కారు నుంచి దిగిపోయింది. పక్కనే ఉన్న మెట్రో స్టేషన్ కు వెళ్లింది.
Also Read: Why Does Love Change After Marriage? (పెళ్లి తరువాత ప్రేమ తగ్గిపోయిందా..? అయితే ఇలా చేయండి..!!)
ఎంచక్కా మెట్రో రైలులో ప్రయాణించి పెళ్లి మండపానికి చేరుకుంది(Bengaluru Bride Takes Metro on Her Wedding Day to Avoid Traffic). ముహూర్తం టైంకు పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆమె మెట్రోలో ప్రయాణించిన వీడియో చూసిన కొందరు నెటిజన్లు ఆమెను కొనియాడారు. ఈ పెళ్లి కూతురు చాలా స్మార్ట్ అని ప్రశంసించారు. మరికొందరు మాత్రం విమర్శలు గుప్పించారు. ట్రాఫిక్ ఉంటుందని తెలుసు కదా.. టైంకి పెళ్లిమండపానికి చేరుకునేలా కాస్త ముందే బయల్దేరవచ్చు కదా అని సలహా ఇస్తున్నారు.
Whatte STAR!! Stuck in Heavy Traffic, Smart Bengaluru Bride ditches her Car, & takes Metro to reach Wedding Hall just before her marriage muhoortha time!! @peakbengaluru moment 🔥🔥🔥 pic.twitter.com/LsZ3ROV86H
— Forever Bengaluru 💛❤️ (@ForeverBLRU) January 16, 2023