సోనూ సూద్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. సోనూ సూద్ కి దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.. సినిమాల్లో విలన్ పాత్రల్లో భయపెట్టిన సోనూ సూద్ నిజజీవితంలో మాత్రం ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ ఎందరికో సాయం చేసి తన మంచి మనసు చాటుకున్నాడు. కరోనా కల్లోల సమయంలో ఎంతోమందిని సోనూ ఆదుకున్న తీరు చూసి, తెరపై ఆయనను చూసి భయపడ్డవారే ఆనందంతో అభినందనలు తెలిపారు.
రీల్ పై విలన్.. రియల్ లైఫ్ లో హీరో అంటూ కొనియాడారు. ప్రస్తుతం చైనాలో కరోనా కేసులు ఎక్కువ అవ్వడంతో, భారత్ కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. స్టేట్ గవర్నమెంట్స్ కి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర వైద్యశాఖ. ఈ నేపథ్యంలోనే విదేశాలు నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలోనే టెస్ట్ లు నిర్వహిస్తున్నారు.
Also Read : నంది శివునికి ఎలా దగ్గరయ్యాడు?
కాగా కరోనా కష్ట సమయంలో అందరికి ఆపద్బాంధవుడైన సోనూ సూద్ మరోసారి రంగంలోకి దిగడానికి సిద్దమయ్యాడు. ‘కరోనా మళ్ళీ తిరిగి వచ్చేసింది. చాలా జాగ్రత్తగా ఉండండి, అసలు భయపడకండి. ఏదైనా సమస్య ఉన్నా, సహాయం కావాల్సి ఉన్నా.. నన్ను సంప్రదించండి. నా పాత నెంబర్ ఇంకా పని చేస్తూనే ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
Sonu Sood aims to help people in crisis. In a media interaction, Sonu revealed that his old number is still active while informing everyone.
कोरोना से सावधानी बरतें, डरे नहीं
ईश्वर करे मेरी ज़रूरत ना पड़े
लेकिन अगर लगे
तो याद रखना .. नंबर वही है ❤️🙏— sonu sood (@SonuSood) December 23, 2022