Bhagwat Kesari : భగవత్ కేసరి పేరుతో బాలకృష్ణ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఇంతకుముందే అఖండ, విరసింహారెడ్డి తో మంచి ఫాలో లో ఉన్న బాలకృష్ణ ఇప్పుడు భగవంత్ కేసరి తో మళ్లీ బరిలోకి దిగనున్నారు. అనిల్ రావిపూడి ఇప్పటికే టాలీవుడ్ లో మంచి సక్సెస్ఫుల్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అనిల్ దర్శకత్వంలోనే ఇప్పుడు భగవంత్ కేసరి రాబోతుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.
పెళ్లి చేసుకొని ఒక పాపకు జన్మనిచ్చిన తర్వాత కాజల్ అగర్వాల్ నటిస్తున్నటువంటి మొదటి సినిమా ఇదే కావడం విశేషం. అలాగే ఈ సినిమాలో శ్రీలీల కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే బాలకృష్ణ, శ్రీలీల ఇద్దరు కలిసి తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక చిన్న ప్రోమో ను,పోస్టర్, గ్లింప్స్ ని విడుదల చేశారు. ఇప్పటికే ఇవి రెండు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. బాలయ్య వీటిల్లో చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించారు. అలాగే ప్రోమో సూపర్ డూపర్ గా ఉంది అంటూ ప్రేక్షకులు సంబరపడిపోతున్నారు.
బిడ్డా చప్పుడు జర గట్టిగా చేయమను అంటూ బాలయ్య అంటుంటే.. మీ తీన్మార్ పక్కన పెట్టండి, మా చిచ్చా వచ్చిండు ఎట్లుండాలే, కొట్టర కొట్టు సౌమారే.. అంటూ శ్రీలీల చెప్పడం ఆసక్తిగా అనిపించింది. ఇద్దరు తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఈ సినిమా అక్టోబర్ 19న విడుదలకు కానుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అనిల్ రావిపూడి కామెడీ మార్క్ కూడా ఉంటుందని ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.