గంట శ్రీనివాసరావు వైసీపి లోకి రావోద్దంటూ భీమిలి నియోజకవర్గం వ్యాప్తటగా వైఎస్ఆర్ సిపి శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేశారు. మాకొద్దు భూకబ్జాదారుడు గంటా మాకొద్దు అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు.
పీఎం పాలెం,చిన్నాపురం, తగరపువలస జంక్షన్లు గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి తీసుకోవద్దు అంటూ నినాదాలతో మార్మోగేలా తమ అసంతృప్తిని తెలియజేశారు. ఈ నిరసనలు వెనక భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస రావు హస్తం ఉందని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి.