Bhojpuri Star Pawan Singh: స్టేజ్‌పై హీరోయిన్ నడుము తడిమిన హీరో.. నటుడి అసభ్యప్రవర్తనపై విమర్శలు
Bhojpuri Star Pawan Singh: భోజ్‌పురి సినీ పరిశ్రమలో ఒక నటుడి ప్రవర్తన ప్రస్తుతం తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రముఖ నటుడు పవన్ సింగ్ తన సహనటి అంజలి రాఘవ్‌తో ఒక వేదికపై అనుచితంగా ప్రవర్తించినట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ సింగ్‌ను విమర్శిస్తున్నారు.
ఒక బహిరంగ కార్యక్రమంలో పవన్ సింగ్, అంజలి రాఘవ్ కలిసి వేదికపైకి వచ్చారు. ఈ సందర్భంగా అంజలి రాఘవ్ ప్రేక్షకులవైపు తిరిగి మాట్లాడుతుండగా, పవన్ సింగ్ ఆమె నడుముపై అనుమతి లేకుండా చేయి వేసి తడిమినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా, ఆమె నడుముపై ఏదో ఉందని పదే పదే చెప్పడంతో అంజలి ఒక్క క్షణం అసౌకర్యానికి గురయ్యారు. అయితే, ఆ పరిస్థితిని కవర్ చేయడానికి ఆమె వెంటనే చిరునవ్వుతో ముందుకు సాగారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్ల నుండి పవన్ సింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది నెటిజన్లు ఆయన ప్రవర్తనను ‘క్రీపీ’ (creepy) అని అభివర్ణిస్తున్నారు. మరికొందరు పవన్ సింగ్ ప్రవర్తన పూర్తిగా అసభ్యకరమని, ఒక మహిళను ఆమె అనుమతి లేకుండా బహిరంగంగా తాకడం సరికాదని మండిపడుతున్నారు. ఈ సంఘటన భోజ్‌పురి సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. అయితే, ఈ వివాదంపై పవన్ సింగ్ గానీ, అంజలి రాఘవ్ గానీ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. వారి నుంచి ప్రకటన కోసం అభిమానులు, నెటిజన్లు ఎదురుచూస్తున్నారు.
https://x.com/TARUNspeakss/status/1961053678783410379
ఇండస్ట్రీ అంటేనే చాలామందికి చిన్నచూపు ఉంది. కానీ ఒకప్పటితో పోలిస్తే నటీమణుల్లో కాస్త చైతన్యం వచ్చింది. తమకు ఇలాంటి అసౌకర్యం జరిగితే బయటకొచ్చి చెబుతున్నారు. మీటూ ఉద్యమం కూడా అప్పట్లో పెద్ద ఎత్తున నడిచింది. అయినా సరే కొందరు హీరోలు ఇలా పబ్లిక్‌గా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మరి దీన్ని పవన్ సింగ్ ఎలా కవర్ చేసుకుంటాడనేది చూడాలి? ప్రస్తుతం భోజ్‌పురిలో సినిమాలు చేస్తున్న ఇతడు.. త్వరలో బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు?
