Bhuvanagiri News:యాదాద్రిలో కీచక ప్రిన్సిపాల్…విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన
విద్యా బుద్దులు నేర్పించాల్సిన గురువే కామంధుడు అవతారం ఎత్తి విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకి గురి చేస్తున్న వైనం తాజాగా యాదాద్రి భువనగిరిలో చోటు చేసుకుంది.భువనగిరి పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కి చెందిన ప్రిన్సిపాల్, పదో తరగతి విద్యార్థినులని లైంగిక వేధింపులకి గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ విద్యార్థినుల తల్లిదండ్రులు స్కూల్ ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు.
స్కూల్ కి చెందిన పదో తరగతి విద్యార్థినికి మాయమాటలు చెప్పి, స్పెషల్ క్లాస్ పేరిట తన ఛాంబర్ లోకి పిలిపించుకుని అసభ్యంగా ప్రవర్తించిన ప్రిన్సిపాల్ సురేష్ గురించి సదరు విద్యార్థిని ఇంట్లో చెప్పడంతో.. తల్లిదండ్రులు స్కూల్ వద్దకి చేరుకొని ప్రిన్సిపాల్ ని చితకబాది పోలీసులుకి అప్పగించారు. ఆ పై పెద్ద ఎత్తున స్కూల్ ముంగిట ధర్నా చేపట్టారు.దీనితో అక్కడికి చేరుకున్న విద్యార్థి సంఘాలు, ప్రభుత్వం, స్థానిక కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకొని ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకొని స్కూల్ ని ముసివేయాలని డిమాండ్ చేశారు. అలాగే నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరారు.