Bipasha Counter to Mrunal: పాతకాలపు ఆలోచనల నుండి బయటకు రా.. మృణాల్‌కు బిపాషా బసు కౌంటర్
Bipasha Counter to Mrunal: కొద్దిరోజులుగా నటి మృణాల్ ఠాకూర్ వార్తల్లో నిలుస్తున్నారు. ‘సీతారామం’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ భామ, ఇటీవల ధనుష్‌తో డేటింగ్ రూమర్స్‌తో వార్తల్లోకి రాగా, తాజాగా బిపాషా బసుపై ఆమె గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోతో మరోసారి చర్చనీయాంశమయ్యారు. ఈ నేపథ్యంలో బిపాషా బసు పరోక్షంగా మృణాల్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారని నెటిజన్లు భావిస్తున్నారు.
బిపాషా స్ట్రాంగ్ కౌంటర్..
బిపాషా బసు సోషల్ మీడియాలో మహిళలను ఉద్దేశించి చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. “బలమైన మహిళలు ఎప్పుడూ ఒకరికొకరు తోడుగా ఉంటారు. వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అమ్మాయిలు బలంగా కనిపించకూడదు అనే పాతకాలపు ఆలోచనల నుంచి బయటకు రండి” అని ఆమె రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కి “మిమ్మల్ని మీరు ఎప్పుడూ ప్రేమించుకోండి” అని క్యాప్షన్ ఇచ్చారు. మృణాల్ వ్యాఖ్యలకు కౌంటర్‌గానే బిపాషా బసు ఈ పోస్ట్ చేసిందని చాలామంది నెటిజన్లు భావిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
కొంతకాలం క్రితం మృణాల్ ఠాకూర్ ఒక ఇంటర్వ్యూలో బిపాషా బసు గురించి మాట్లాడుతూ, ఆమె “పురుషుడిలా కండలు” ఉన్నట్లు కనిపిస్తారని, తనకంటే అందంలో తక్కువని వ్యాఖ్యానించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతోంది. ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ ప్రముఖులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మృణాళ్ వ్యాఖ్యలను చాలా మంది తప్పుపట్టారు. అయితే అప్పుడు సైలెంట్‌గా ఉన్న బిపాషా బసు.. ఇప్పుడు ఈ కౌంటర్ ఇవ్వడంతో మరోసారి వివాదం తలెత్తింది.
ఆ పుకార్లకు ఫుల్‌స్టాప్..
ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే, ఇటీవల ధనుష్ తో డేటింగ్ వార్తలపై కూడా మృణాల్ స్పందించారు. అజయ్ దేవగణ్ పిలిస్తేనే ధనుష్ ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ఈవెంట్‌కు వచ్చారని, అంతకు మించి తమ మధ్య ఏమీ లేదని స్పష్టం చేశారు. ధనుష్‌తో తన సంబంధం కేవలం స్నేహం మాత్రమేనని చెప్పారు. ఈ రూమర్స్ తనకు చాలా ఫన్నీగా అనిపించాయని అన్నారు. అలా ధనుష్ తో మృణాల్ డేటింగ్ చేస్తోందంటూ వచ్చిన పుకార్లకు ఫుల్‌స్టాప్ పడింది.