బిజెపి డిపాజిట్లు కోల్పోవడం ఖాయమని, కాంగ్రెస్ గెలిచే పార్టీ కాదని, ఓడిపోతమానే సిద్దిపేటలో బీజేపీ డబ్బుల డ్రామా ఆడుతుందని టిఆర్ఎస్ నేత హరీష్ రావు దుబ్బాక ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
దౌల్తాబాద్ మండలం దొమ్మటా గ్రామం లో ఎన్నికల ప్రచారం లో భాగంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్లు తెరాస, గులాబీజెండా కష్టపడితే తెలంగాణ వచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఉన్నా, బీజేపీ ప్రభుత్వం ఉన్నా మనకు జరిగింది ఏమీ లేదు.
ఏపీలో ఉన్నప్పుడు తెలంగాణకు ఏం లాభం జరగలేదు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ తాగడానికి నీరు ఇంటింటికి వచ్చేలా చేశారు.
నీళ్ల బాధ కాంగ్రెస్ తీర్చిందా.? బీజేపీ తీర్చిందా.? ఏ పార్టీ తెలంగాణను అభివృద్ధి చేసిందో ప్రజలకు తెలుసు బీజేపీ 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఏక్కడైనా ఉచిత కరెంటు ఇస్తున్నారా..?! కాంగ్రెస్ ఇస్తుందా ఏ రాష్ట్రంలోనైనా..?
బాయిలకాడ, బోర్ల కాడ బీజేపీ మీటర్లు పెట్టాలంటోంది. మీటర్లు పెట్టాలంటారా..? కాంగ్రెస్ అంటే కాలిపోయే మీటర్లు. బీజేపీ అంటే బోర్లు, బావుల కాడ మీటర్లు, కారు గుర్తంటే 24 గంటల ఫ్రీ కరెంటు.. ఏది కావాలో రైతులు ఆలోచించాలి. దొమ్మాటలో 1 కోటీ 53 లక్షల రూపాయలను రైతు బంధు కింద 1338 మందికి ఎకరానికి 5 వేలు వానాకాల పంటకు ఇచ్చారు. దీపావళి తర్వాత మరో 5 వేలు సీఎం ఇస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు రైతు శిస్తు అని వివిధ రకాలుగా పన్నులు వసూలు చేస్తే..తెరాస వచ్చాక రైతుకే సీఎం కేసీఆర్ డబ్బులు ఇస్తున్నారు. ఎరువులు కోసం గోస ఏక్కడైనా తెరాస పాలనలో ఉందా… రైతు బీమా 5 లక్షలు రైతు చనిపోతే ఇస్తున్నామా లేదా.? మహిళలను బీజేపీ, కాంగ్రెస్ నేతలు తక్కువ చేసి చూస్తున్నారు. వారికి దుబ్బాక మహిళలు బుద్ది చెప్పాలి.
బీజేపీకి మూడో సారి డిపాజిట్ కోల్పోవడంలో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. ఓడిపోతమనే భయంతో సిద్దిపేటలో నిన్న బీజేపీ హై డ్రామా ఆడుతుంది.
డబ్బులు నీ ఇంట్లోవి కాకపోతే ప్రచారం మానేసి ఎందుకు సిద్దిపేట పరుగెత్తుకొచ్చారని ఆయన ప్రశ్నించారు. మీ మామ, అత్త డబ్బులు దుబ్బాక ఓటర్లకు పంచడానికే అన్న వీడియోలు విడుదలయ్యాయి.
బీజేపీ అభ్యర్థిది పని చేసే ముఖామే అయితే ప్రజలకు పైసలు, సీసాలు, చీరలు పంచి ఓటు అడుగుతారా.!?? అంటూ ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు.