BJP Vs BRS:దేశ రాజధానిలో బీజేపీ-BRS అమీతుమీ… వేడి రాజేస్తున్న పోటా పోటీ ధర్నాలు
కేంద్రం లోని బీజేపీ తో కేసీయార్ BRS పార్టీ బహిరంగ యుద్దానికి తెర తీసింది. ఇందుకు వేదిక రాజధాని ఢిల్లీ కావడం రాజకీయంగా తీవ్ర చర్చకి దారితీసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ పై ఈఢీ ఆరోపణలు ఎదురుకుంటున్న సియం కూతురు ఎమ్మెల్సీ కవిత రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ధర్నా తలపెట్టగా, బీజేపీ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ధర్నా చేయనుంది.
దీనితో ఢిల్లీ లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.అయితే మొదట బీజేపీ కూడా జంతర్ మంతర్ వద్దే ధర్నా చేయాలని భావించగా, ఆ తరువాత వేరే చోటుకి అయిన దీన్ దయాల్ మార్గ్ ని వేదికగా మార్చుకున్నారు.మరోవైపు తెలంగాణా లో కూడా బండి సంజయ్ ,తెలంగాణా లో ఉన్న బెల్టు షాపుల రద్దు కొరకు ఒకరోజు దీక్ష చేయనున్నారు.
మొత్తానికి బీజేపీ, BRS పార్టీలు ఒకరిమీద ఒకరు కత్తులు దూసుకుంటున్నాయి.చూడాలి మరి మున్ముందు ఇరు పార్టీల వ్యవహారం ఏ మేరకు దేశ రాజకీయాలని ప్రభావితం చేస్తాయో, ఎలాంటి పరిణామాలకి దారి తీస్తాయో….