బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికల ఖర్చు: ఈ ఏడాది ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల ఖర్చు : ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్ మరియు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రూ.344.27 కోట్లకు పైగా ఖర్చు చేసింది. అదే సమయంలో, ఈ రాష్ట్రాల్లో పార్టీ గతసారి 2017 లోమాత్రం రూ.218.26 కోట్లు ఖర్చు చేసింది. ఎన్నికల సంఘానికి బీజేపీ సమర్పించిన నివేదికలో ఈ సమాచారం అందింది. కాంగ్రెస్ ఖర్చు చేసిన మొత్తం ఒకసారి పరిశీలిస్తే 2022లో ఈ ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ రూ.194.80 కోట్లు ఖర్చు చేయగా, 2017లో ఆ పార్టీ రూ.108.14 కోట్లు ఖర్చు చేసింది.