Black Coffee : ఉదయం లేవగానే చాలామందికి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఆ కాఫీ బ్లాక్ కాఫీ అయితే ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతాయని, బ్లాక్ కాఫీ తాగడం వల్ల స్థూలకాయం దరిచేరదాని, గుండె జబ్బులను దూరం చేస్తుందని అధ్యాయనాలు చెబుతున్నాయి. బ్లాక్ కాఫీ లో ఉండే పోషక పదార్థాల వల్ల శరీరంలో ఉన్న డయాబెటిస్, కొలెస్ట్రాల్, స్థూలకాయం వంటి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.
బ్లాక్ కాఫీలో మన శరీరాన్ని విష వ్యర్ధలా నుంచి కాపాడే యాంటీ ఆక్సిడెంట్ల శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాఫీలో ఉండే కెమికల్ కాంపౌండ్ చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. వాటి ద్వారా చాలా రకాల వ్యాధులు మన శరీరానికి సోకకుండా కాపాడుతాయి. ముఖ్యంగా ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి సోకకుండా ఈ కాఫీ అడ్డుకోగలదని నిపుణులు సూచిస్తున్నారు. బ్లాక్ కాఫీ శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడంలో సహాయం చేస్తూ కాలేయానికి సహజ సిద్ధమైన క్లీనర్ గా కూడా పనిచేస్తుంది.
దీనివల్ల అధిక బరువు సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాలను తొలగించడంలో ముఖ్యపాత్ర పోషించి, జీవక్రియ సమర్ధవంతంగా పనిచేయడంలో ప్రధమంగా ఈ బ్లాక్ కాఫీ నిలుస్తుంది. ఒక కప్పు బ్లాక్ కాఫీలో రెండు కేలరీలు ఉంటాయి. అంటే ఈ లెక్క ప్రకారం తక్కువగా కెలరీలు ఉన్నాయని అర్థం. పంచదార, పాలు, బెల్లం, సోయా మీల్క్, చాక్లెట్ సిరప్, వెనీలా లాంటి ఇతర పదార్థాలను కాఫీకి జత చేయకుండా తాగడం మంచిది.
అలాగే బ్లాక్ కాఫీలో ఉండే క్లోరోజనిక్ యాసిడ్ కారణంగా రాత్రి భోజనం తర్వాత శరీరంలో గ్లూకోస్ ఉత్పత్తి ఆలస్యం అవుతుంది. దాని ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయని అమెరికా చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. బ్లాక్ కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది మన శరీరంపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందో.. కూడా మనం తెలుసుకోవాలి. కెఫిన్ అనే పదార్థం వాస్తవానికి మెదడును, కేంద్ర నాడీ వ్యవస్థను చురుకుగా చేయడానికి సహాయపడి, శక్తి, సామర్థ్యాలను మెరుగుపరచడంలో ముందడుగులో ఉంటుంది.
శరీరంలో నీరు ఎక్కువైనప్పుడు బరువు పెరగడం, పొట్ట పెరగడం అతి సాధారణం. బ్లాక్ కాఫీ తాగడం వల్ల శరీరంలోని అవసరం లేని నీటిని బయటకు పంపించేస్తుంది. తరచూ యూరిన్ కి వెళ్లడం వల్ల బాడీలో అదనపు బరువు తగ్గుతుంది. కాబట్టి బ్లాక్ కాఫీ తాగడం అలవాటు చేసుకొవడం ఆరోగ్యానికి మంచిదే అని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు రెండు కప్పుల కాఫీ కి మించి తాగితే కెఫిన్ దుష్పరిణామాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.