Black Guava : పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనం ప్రత్యేకంగా చెప్పుకొవాల్సిన అవసరం లేదు. మనం తీసుకునే రోజువారి ఆహారంలో పండ్లను చేర్చినట్లైతే మనం ఆరోగ్యవంతంగా ఉండగలుగుతాము. అలాంటి పండ్లలో నల్లజామ పండుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా.. నల్లజామ పండు గురించి ఎక్కువమందికి తెలియకపోవచ్చు.
కానీ ఆ పండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మెండు. ఇక ఆలస్యం ఎందుకు వెంటనే నల్లజామా గురించి తెలుసుకుందాం. మనకు తెలిసిన జామపళ్ళు పచ్చ రంగులో ఉంటాయి. జామ పండ్ల సీజన్ రాగానే ఖచ్చితంగా అందరూ ఈ పండ్లను తింటూ ఉంటారు. వాటిల్లో ఉండే పోషకాలు మనల్ని కాపాడుతూ ఉంటాయి. పచ్చ జామపండ్ల వల్ల ఉపయోగాలు మనకు తెలుసు. కానీ నల్లజామ పండ్లు, పచ్చజామల కంటే అధిక రెట్లు పోషకాలు కలిగి ఉంటాయి.
విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి లాంటి ఎన్నో పోషకాలను నల్లజామ కలిగి ఉంటుంది. ఇది మన శరీరానికి చాలా మంచిది. నల్లజామ రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. నల్లజామ తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు, మలబద్ధకం, పొట్ట సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. అలాగే రక్తహీనతతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు తమ ఆహారంలో నల్లజామలు చేర్చుకున్నట్లైతే చక్కటి ఫలితాలను చూస్తారు. మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచడంలో నల్లజామ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.
అలాగే మన శరీరం తరచూ ఇన్ఫెక్షన్లకు గురైతున్నట్లయితే వాటిని పూర్తిగా నియంత్రణలో ఉంచుతుంది. వాటి బారిన మనం పడకుండా నల్లజామ రక్షిస్తుంది. యాంటీ ఏంజింగ్ గుణాలు నల్లజామ కలిగి ఉండడం వల్ల వృద్ధాప్యాన్ని కూడా నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. ఈ పండును తీసుకోవడం వల్ల చర్మం పై ఉన్న ముడతలు తగ్గిపోయి యవ్వనంగా కనిపిస్తారు. కానీ ఈ నల్లజామలు మనకు ఇండియాలో మాత్రం దొరకవు. ఇవి ఎక్కువగా బ్రెజిల్, సౌత్ అమెరికాలో మాత్రమే దొరుకుతాయి.