Black Raisins : ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో ఎండు ద్రాక్ష ఒకటి. వీటిలో చాలా పోషకాలు ఉంటాయి. ఆరోగ్యం నిపుణులు వీటిని రోజు తీసుకోమని సూచిస్తూ ఉంటారు. ఎండుద్రాక్షల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు, బీటా కెరోటిన్, క్యాల్షియం, మెగ్నీషియం శరీరానికి మంచిని చేస్తాయి. ద్రాక్ష మనకు రెండు రకాలుగా దొరుకుతుంది. ఒకటి తెలుపు రంగులో, మరొకటి నలుపు రంగులో.
మార్కెట్లో మనకు ఇవీ సులువుగానే లభ్యమవుతున్నాయి. అయితే నలుపు ఎండు ద్రాక్షను నానబెట్టి తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. నలుపు ఎండు ద్రాక్షలో సహజంగా ఉండే చక్కర శాతం ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ ద్రాక్షను తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అధిక బరువు సమస్య నుంచి కూడా నానబెట్టిన ఎండుద్రాక్షలను తినడం వల్ల బయటపడవచ్చు అని వారు తెలుపుతున్నారు.
అలాగే మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సులభంగా బయటికి పంపించేస్తుంది. అయితే తగిన మోతాదులోనే ఎండు ద్రాక్షను తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎండుద్రాక్ష జీర్ణక్రియను మెరుగుపరుచుతుంది. జీర్ణక్రియ సరిగ్గా ఉంటే చాలా అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. అలాగే ఆహారం అతిగా తీసుకోవడం వల్ల కూడా జీర్ణసమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ సమస్యల నుంచి ఈ ఎండు ద్రాక్ష మనల్ని బయటపడవేస్తుంది.
ఇందులో ఉండే గుణాలు గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలను మనకు దూరం చేస్తాయి. ఎండు ద్రాక్ష కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం చాలామంది విటమిన్స్ లోపంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు కంటిచూపు సమస్యను ఎదుర్కొంటారు. వారికి ఎండు ద్రాక్ష తినడం చక్కటి ఉపశమనం. ఎండు ద్రాక్షను ప్రతిరోజు తినడం వల్ల కంటిశుక్లం పనితీరు మెరుగ్గా అవుతుంది.