Blood Donation : రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని బలహీన పడుతారు అని అందరూ అనుకుంటూ ఉంటారు. లేని జబ్బులు వస్తాయి అని ఇలా అందరిలోపల చాలా అపోహలు ఉంటాయి. కానీ రక్తదానం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 18 నుండి 60 సంవత్సరాల లోపు ఎవరైనా రక్తదానం చేయొచ్చు.
వయసు విషయంలో కాస్త జాగ్రత్త పడి రక్తదానం చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని వైద్యులు చెబుతున్నారు. 45 కిలోలపై బరువు ఉన్నవాళ్లు ఎలాంటి సందేహాలు లేకుండా రక్త దానం చేయొచ్చు.
రక్తదానం చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు :
1. రక్తదానం చేయడం వల్ల శరీరంలో ఐరన్ స్థాయి అదుపులో ఉంటుంది.
2. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
3. రక్తదానం చేయడం వల్ల శరీరంలో కొత్త రక్త కణాలు వృద్ధి చెందుతాయి.
4. కాలేయం పనితీరు మెరుగు పడుతుంది.
5.రక్తదానం చేయడం వల్ల పెద్ద ప్రేగు, కాలేయం, ఊపిరితిత్తులు, గొంతు లాంటి అవయవాలు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువ.
రక్తదానం వల్ల ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యవంతమైన వాళ్ళు సంవత్సరానికి మూడుసార్లు రక్తదానం చేయొచ్చు. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా రక్తదానం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం రక్తదానం చేయకపోవడమే మంచిది అని వైద్యుల సలహా. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని ప్రజలకు రక్తం విలువని తెలపాలనే ఉద్దేశంతో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఏటా జూన్14న నిర్వహిస్తున్నారు.