బ్రిటీష్ రాచరిక పాలన అంతరించి 75 ఏళ్ళు గడిచినా వారి వలసవాద పాలనకు ఇంకా మానని గాయాలుగా మిగిలిన సజీవ గుర్తులను ప్రధాని నరేంద్ర మోదీ తుడిచివేస్తున్నారు అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ మోదీ కి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి మోదీ కి జపాన్ లో భద్రపరచిన నేతాజీ అస్థికలను కూడా ఇండియాకు రప్పించవలసిందిగా కోరారు. గతం లో కూడా ఓ పుస్తకావిష్కరణ సభలో పవన్ కళ్యాణ్ ఇదే విషయం పై కేంద్రానికి విజ్ఞప్తి చేయడం జరిగింది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి మనుమరాలు రాజశ్రీ చౌదరీ బోస్ గారి అనుమతితో ఆమె డి.ఎన్.ఏ.తో వాటిని సరిపోల్చవలసిందిగా విజ్ఞప్తి చేసారు.
ఇది సాకారమైతే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లక్ష్యం సిద్ధిస్తుంది. భారత జాతి విముక్తి కోసం పోరాడిన ఆ మహనీయునికి నివాళిగా మిగిలిపోతుందని భావిస్తున్నాను అని ఆయన తెలిపారు.
దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి..
