ప్రపంచంలోనే అతి పెద్దదైన నిర్మాణం బుర్జ్ ఖలీఫా(దుబాయ్) సంస్థ దివాళా దిశగా సాగుతోంది. కరోనా వ్యాప్తి వలన ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు ఆర్థిక సంక్షోభం లో చిక్కుకున్నాయి. ఇప్పుడు ఈ సంస్థ కూడా “ఇకపై మేము సంస్థ నడిపే పరిస్థితులు లేవు” అని ప్రకటించింది.
2004లో నిర్మాణం ప్రారంభించిన ఈ కట్టడం 829 మీటర్ల ఎత్తుతో 2009లో నిర్మాణం పూర్తి చేసుకుంది. 1.5 బిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మించిన ఈ కట్టడం ప్రపంచవ్యాప్తంగా ఆర్కిటెక్చర్ అద్భుతంగా నిలిచింది.163 అంతస్థులతో ఆకాశాన్ని తాకే విధంగా నిర్మితమైన ఈ కట్టడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది పర్యాటకులను విశేషంగా ఆకర్షించింది. 57 ఎలివేటర్స్ 8 లిఫ్టులతో
అలరారే ఈ కట్టడం నిర్మాణం పూర్తయిన తర్వాత మరెన్నో ఎత్తైన కట్టడాలు నిర్మాణానికి స్ఫూర్తిగా నిలిచింది.