Calcium : శరీరంలో కాల్షియం లోపిస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా దంతాల సమస్యలు, గోళ్లు విరిగిపోవడం లాంటి సమస్యలు బాధపెడుతుంటాయి. 30 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఈ సమస్యలు ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి కాల్షియం శరీరంలో సమృద్ధిగా ఉండేలాగా జాగ్రత్త పడాలి. కాల్షియం లోపిస్తే తల తిరగడం, వేళ్ళు, పాదాలు కాళ్లలో తిమ్మిర్లు రావడం బద్దకంగా అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించడం లేకపోతే దానికి తగిన ఆహారాన్ని తీసుకొని సమస్య నుంచి బయటపడాలి. క్యాల్షియం పెరగడానికి తీసుకోవలసిన ఆహారాలలో పాలు ముఖ్యమైనవి. ప్రతిరోజు మన డైట్ లో పాలు ఉండేలాగా చూసుకోవాలి. కాల్షియం పెంచే వాటిల్లో పెరుగు కూడా ముఖ్యమైనది. ప్రతిరోజు ఆహారంలో పెరుగును ఉండేలా చూడాలి. అలాగే తెల్ల నల్ల నువ్వులల్లో కూడా క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఖర్జూర పండ్లలో కూడా క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి.
అవిసె గింజలు మనకు ఇప్పుడు లభ్యమవుతున్నాయి. వాటి పొడిని రోజు తాగడం వల్ల కాల్షియం ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్లు పొందవచ్చు. గసగసాలు, మెంతుకూర, మునగాకుల్లో కాల్షియం అధికంగా దొరుకుతుంది. గుడ్లు క్యాల్షియం కు మంచి ఆహారమని చెప్పవచ్చు. అలాగే పాలకూర, బాదం, జీడిపప్పు, బీట్రూట్, సోయాబీన్స్, వాటీల్లో కాల్షియం అధికంగా లభిస్తుంది. పొద్దుతిరుగు గింజల్లో కూడా కాల్షియం దొరుకుతుంది. ఈ విత్తనాలను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే చాలా మంచిది. ఆహారంలో తగిన శ్రద్ధ తీసుకొని కాల్షియం పెంపొందించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.