Causes of Fire in Ankur Hospital : అంకుర్ ఆస్పత్రి అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ హాస్పిటల్ అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 68 వద్ద ఉన్న గుడిమల్కాపూర్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. అయితే హాస్పిటల్లో ఒకేసారి మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల ఉన్న జనాలు భయభ్రాంతులకు గురయ్యారు. హాస్పిటల్ లో ఉన్న ఫ్లోర్లన్నీ మంటలు వ్యాపించాయి.
సిబ్బంది వెంటనే అప్రమత్తమయి అక్కడ ఉన్న రోగులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే హాస్పిటల్లో ఇప్పటికే రోగుల సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తుంది. అసలు మంటలు వ్యాపించడానికి ప్రధాన కారణం షార్ట్ సర్క్యూట్ అని యాజమాన్యం వెల్లడించింది. పై ఫ్లోర్లో ఉన్న ప్లాస్టిక్ సంబంధిత వస్తువులు అంటూకోవడం వల్లనే మంటలు విదృతంగా వ్యాపించాయని తెలుస్తుంది. అలాగే

పదవ ఫ్లోర్ లో ఉన్న బ్యానర్లు అంటుకొని విపరీతమైన పొగ అన్ని ఫ్లోర్ లలోకి అలుముకుందని, వాటి వల్ల మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బందికి చాలా కష్టమైందని తెలుస్తుంది. కానీ అగ్నిమాపక సిబ్బంది మాత్రం చాలా కష్టాన్ని ఎదుర్కొని మంటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు రోగులకు ఎలా ఉందనే సమాచారం మాత్రం తెలియడం లేదు. యాజమాన్యం ముందస్తు చర్యలను తీసుకుంటున్నాము రోగులను కాపాడే ప్రయత్నం చేస్తున్నామని తెలుపుతున్నారు.
